లారీ ఆయిల్ ట్యాంక్ లో అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా

కృష్ణా జిల్లా: రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో వినూత్నంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న‌వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణాజిల్లా, మైల‌వ‌రంలో మంగ‌ళ‌వారం పోలీసులు విస్తృత త‌నిఖీలు చేసి రూ. 1.26 లక్షలు విలువ చేసే 1062 అక్రమ మద్యం బాటిల్స్ పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు వ్యక్తులతో పాటు, లారీ, కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీఎస్పీ శ్రీనివాసులు. అలాగే వినూత్న తీతిలో లారీ ఆయిల్ ట్యాoక్ లో సగ భాగంలో మద్యాన్ని తరలిస్తుండగా గుర్తించిన పోలీసు సిబ్బంది…ఇబ్రహీంపట్నానికి చెందిన గోపాలరావు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఆయిల్ ట్యాoకర్ లో దాచి ఉంచిన మద్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయామ‌ని తెలిపారు పోలీసులు. మరో ఘటనలో విజయవాడకు చెందిన గోపాలరావు, మస్తాన్ వలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…తనిఖీల్లో పాల్గొన్న మైలవరం సిఐ శ్రీనివాస్, ఎస్ ఐ రాంబాబు, సిబ్బందికి రివార్డులు అందిస్తామన్నారు డీఎస్పీ శ్రీనివాస్.

Latest Updates