రాష్ట్రంలో చదువురానోళ్లు 66 లక్షలు

    ప్రైవేటు బడులకే పంపుతున్నరు

    53 శాతం మంది పిల్లలు వాటిలోనే 

    రాష్ట్ర సోషియో ఎకనామిక్​సర్వే

హైదరాబాద్, వెలుగు: పిల్లలను ప్రైవేటు బడికి పంపడానికే రాష్ట్రంలో జనం ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం స్కూళ్లకు వెళ్తున్న వాళ్లలో 53.18 శాతం మంది ప్రైవేటుకే పోతున్నారు. అయితే నాలుగేళ్లుగా గవర్నమెంట్‌‌ స్కూళ్లకు పోతున్నోళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే 2020 ఈ విషయం వెల్లడింది. 2015‌‌–16లో గవర్నమెంట్ స్కూళ్లలో చదివే వాళ్లు 46.06 శాతం ఉంటే ఇప్పడు 46.82 శాతానికి పెరిగిందని.. ప్రైవేటుకు పోయే వాళ్ల సంఖ్య 53.94 నుంచి 53.18 శాతానికి తగ్గిందని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో చదువు రానోళ్లు ప్రస్తుతం 66 లక్షల మంది ఉన్నారని చెప్పింది.

18 ఏండ్లు నిండినవాళ్లందరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా ‘ఈచ్ వన్ టీచ్ వన్’ కార్యక్రమం చేపట్టారంది. పల్లె, పట్టణ ప్రగతిల్లో భాగంగా వీరిని గుర్తించారని చెప్పింది. 2019 సెప్టెంబర్‌‌లో ‘స్టూడెంట్–పేరెంట్/గ్రాండ్ పేరెంట్ లిటరసీ ప్రొగ్రామ్’ను పైలట్‌‌ ప్రాజెక్ట్​గా ప్రభుత్వం చేపట్టిందని తెలిపింది.

Latest Updates