నా పరువు తీయకండి ప్లీజ్

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ మీడియాపై గుర్రుమంటుంది. డ్రగ్స్ కేసులో తన పై ఇష్టం వచ్చినట్లు కథనాల్ని ప్రస్తారం చేస్తున్నారని ఢిల్లీ కోర్ట్ ను ఆశ్రయించింది. తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగేలా మీడియాలో వస్తున్న కథనాల్ని ఆపాలని కోర్ట్ ను కోరింది.

అయితే ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని  మీడియాను అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అక్టోబర్ 15 లోగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కోర్టు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) ను ఆదేశించింది.మంత్రిత్వ శాఖతో పాటు, జస్టిస్ నవీన్ చావ్లా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు న్యూస్ బ్రాడ్ కాస్ట్  అసోసియేషన్లను స్టేటస్ రిపోర్ట్ తదుపరి విచారణ తేదీ నాటికి దాఖలు చేయాలని సూచించింది.

 

Latest Updates