‘ప్రధాని‘ఆశ లేదు..ఎవరు అవుతారన్న ఆసక్తి కూడా లేదు

ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు.గోల్ మాల్‍ చేసే కాంగ్రెస్‍, బీజేపీలు ఈ దేశానికి పనికి రావని, ఆరెండూ లేని ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లవుతున్నావనరులను వాడుకునే తెలివి లేని పాలకులు ఉన్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్ని కల ప్రచారంలో భాగంగా మంగళవారంవరంగల్‌, భువనగిరిలో పార్టీ అభ్యర్థులు పసునూరి దయాకర్‌,బూర నర్సయ్యగౌడ్‌ తరఫున నిర్వహించి న సభల్లో సీఎం మాట్లాడారు. కేసీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

కరెంటు, నీళ్లు ఎందుకు వాడుకోలేం ?

ఇప్పుడు రాహుల్‌ గాం ధీ, నరేంద్ర మోడీ ఇద్దరూ ఒకళ్లనొకళ్లు విమర్శించుకుం టున్నరు. పెడబొబ్బలు పెడుతున్నరు. ఒకటేవిషయం గమనిం చండి.. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏండ్లు అయింది. దేశాన్ని పాలించిం ది వీళ్లు కాదా? ఎన్డీయే రూపంల 11 ఏళ్లు బీజేపీ, 55 ఏండ్లు కాంగ్రెస్‌, మధ్యలో ఒక నాలుగైదు ఏండ్లు ఇతరులు పరిపా లన చేసిండ్రు. వేరే ఇంకెవలోపరిపాలన చేసినట్టు.. వాళ్లే ఇప్పుడు జబ్బలు చరుచుకొని, బస్తీమే సవాల్‌ అని ఒకళ్లమీద ఒగళ్లు ఆరోపణలు చేసుకుం టున్నరు. ప్రధానమంత్రి చోర్‌ హై అని ఒకడు అంటడు. యే మా బేటే జమానత్ హై అని నరేంద్ర మోడీ అంటడు. వీళ్లా దేశానికి కావాల్సింది? ఈ దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి . వాటిని ఎందుకు వాడడం లేదని అడిగితే వీడు మాట్లాటడు. నా వాడు మాట్లాడడు. దేశంలో 3 లక్షల 44 వేల మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తి అయితది. మన తెలివికి ఆ కరెంట్‌ను వాడుతున్నమా ?ఎన్నడు కూడా 2 లక్షల 20 వేల మెగావాట్లు దాటలె. సగందేశం చీకట్లో ఉంటది. ఉత్తర భారత దేశంలో, ప్రధానమంత్రిమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్‌ ఇయ్యరు. కోతలు పెడ్తరు. అంటే ఉన్న నీళ్లు వాడే తెలివి లేదు.ఉన్న కరెంట్‌ వాడుకునే తెలివి లేదు. ఉన్న యువశక్తిని వాడే తెలివిలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినయని వాళ్లే వీరంగం వేస్తావున్నారు.

 వాళ్లెవరు గెల్చినా గులాములే..

తెలంగాణ ప్రయోజనాల కోసం కచ్చి తంగా టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలు గెల్వాలె. మట్టిపనికైనా ఇంటోడే ఉండాలె అని పెద్దలు చెప్పిండ్రు. ఈ బీజేపీ, కాం గ్రెసోళ్లు ఎవరు గెలిచినా వాళ్లు ఢిల్లీ గులాములే కానీ నోరె తెరిచి మాట్లాడేవాళ్లు కాదు. రాహుల్‌‌గాం ధీ, మోడీ ముందు వీళ్లు మాట్లాడుతరా? టీఆర్‌‌ఎస్‌‌ అయితే ఇద్దరే ఎంపీలున్నా పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చింది.అదే పద్ధతిలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చు కోవడానికి కచ్చి తంగా టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలే ఉండాలె. దేశంలో ఉన్న సమస్యలన్నీ పోవాలె. వరంగల్‌‌ మేధావులంతా ఆలోచన చేయాలె. నా కు ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదు. నేను మొదట్నుంచీ చెబుతున్నా. ఎలక్షన్‌‌ వస్తే పార్టీలు కాదు.. గెలవాల్సిం ది. ప్రజలు, వాళ్ల అభిమతం గెల్వాలె. ఇయ్యాలదళితులు ఉన్నరు. కాశ్మీర్‌‌ నుంచి కన్యాకుమారి దాకా వాళ్లు దరిద్రంలో మగ్గుతున్నరు. మన దగ్గర ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఉంది. అసెంబ్లీ లో నా లుగుసార్లు తీర్మానం చేసి పంపించి నం. మేమంతా పోయిమోడీగారిని బతిమాలి అడిగినం.

ఎందుకియ్యరుమీ అయ్య జాగీరా?

దేశంలో ఉన్న సమస్యలన్నీ పోవాలె. వరంగల్‌‌ మేధావులంతా ఆలోచన చేయాలె. నాకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదు. నేను మొదట్నుం చీ చెబుతున్నా. ఎలక్షన్‌‌ వస్తే పార్టీలు కాదు.. గెలవాల్సిం ది. ప్రజలు, వాళ్ల అభిమతం గెల్వాలె. ఇయ్యాల దళితులు ఉన్నరు. కాశ్మీర్‌‌ నుంచి కన్యాకుమారి దాకా వాళ్లు దరిద్రంలో మగ్గుతున్నరు. మన దగ్గర ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఉంది. అసెంబ్లీ లో నా లుగు సార్లు తీర్మానం చేసి పంపించి నం. మేమంతా పోయి మోడీగారిని బతిమాలి అడిగినం. ఎందుకియ్యరు…మీ అయ్య జాగీరా?మా రాష్ట్రంలో మేం చేసుకుంటం అంటున్నం . కేంద్రం తల్చుకుం టే 371 డీ లాగే ఒక్క రాష్ట్రాని కి కూడా ఇవ్వొచ్చు . కానీ కాం గ్రెస్‌‌ ఇయ్యలే.బీజేపీ ఇయ్యలే. రేపు వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలన్నా ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ప్రభుత్వమే రావాలె. ప్రాంతీయ పార్టీల పెత్తనమే నడవాలె. దేశం మారాలని పొ లికేక పెట్టిన. మీరంతా దీ విస్తే దేశం దిశమారుతది. కచ్చి తంగా చెబుతున్నా ఆ ఇద్దరు సన్నాసులు లేని ప్రభుత్వం వస్తది. దేశం దరిద్రం పోతది.చిన్నచి న్న సమస్యలు కూడా వాళ్ల దగ్గర పెట్టుకొని కూసున్నరు. రాష్ట్రాల హక్కులు, అధికారాలు వాళ్లే లాగేసుకున్నరు. గడ్డివాము మీద కుక్క కూసున్నట్టు. వాళ్లు మెయ్యరు. ఇంకొకళ్లను మేయనీయరు. విదేశాంగ నీతి పట్టిం చుకోరు. పాకిస్థాన్‌‌ సమస్య పట్టించుకోరు.ఆర్థిక విధానం పట్టిం చుకోరు. వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు పట్టించుకోరు. కానీ రాష్ట్రాల వెం బడి పడి చిల్లర రాజకీయాలు చేస్తరు.

అప్పుడే బంగారు తెలంగాణ..

రాబోయే రెండు నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తం. రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తం. కోర్టు పరిధిలో లేని సమస్యలను అక్కడి క్కడే పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‍ ని ర్వహిస్తం. పట్టాల కోసం ఎవ్వరికీ నయా పైసా కూడా లంచం ఇవ్వొద్దు . త్వరలో క్రాఫ్కాలనీలను ఏర్పాటు చేయిస్తా. ఏ పంట వేయాలో ప్రభుత్వమే చెబుతుంది. ఏ మండలంలో పండిన పంటలను అదే మండలంలో కొ నుగోలు చేసేలా మహిళా సంఘాలతో పుడ్‍ ప్రాసెసింగ్‍ యూనిట్లను ఏర్పాటు చేస్తం రైతు చెప్పి న ధరకే పంటను కొనుగోలు చేస్తరు. రైతు ఖాతాలో పైసలుం డాలె. వాళ్ల అకౌంట్ల నాలుగైదు లక్షల రూపాయల ని ల్వ ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధించి నట్టు.

Latest Updates