ఈ తరహా ఎన్‌కౌంటర్లకు నేను వ్యతిరేకం

  • దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఒవైసీ స్పందన

న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాజకీయ నాయకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఎంపీ నవనీత్ కౌర్ పోలీసులను అభినందించగా.. మరో ఎంపీ కార్తీ చిదంబరం దీన్ని తప్పుబట్టారు.

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ రకమైన ఎన్‌కౌంటర్లకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై దర్యాప్తుకు స్వీకరించిందన్నారు. పోలీసులు ఆ నలుగురు నిందితులను ఎందుకు ఎన్‌కౌంటర్ చేయాల్సివచ్చిందో ఎంక్వైరీలో తేలుతుందని చెప్పారు ఒవైసీ. న్యూఢిల్లీలో పార్లమెంటు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

MORE NEWS: 

అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలి: ఎంపీ నవనీత్ కౌర్

ఎన్‌కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఆయనా ఓ ఫ్యామిలీ మ్యానే: ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ భార్య

స్త్రీని భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

Latest Updates