అవును నేను కుక్కనే..జనమే నా యజమానులు..నా యజమానుల్ని మోసం చేస్తే కొరికేస్తా

మధ్యప్రదేశ్ లో పోలిటికల్ వార్ హీటును పెంచేస్తుంది. నవంబర్ 3న జరిగే 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత కమల్ నాథ్.., బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా మా మాజీ కుక్క అంటూ సంబోధించారు.

అయితే అశోక్ నగర్ జిల్లాలోని షాడోరాలో జరిగిన పోల్ ర్యాలీలో సింధియా  కమల్ నాథ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. నేను కుక్కనే..ప్రజలే నా యజమానులు. ఎవరైనా సరే నా యజమాని మోసం చేసే ప్రయత్నం చేస్తే కోసేస్తానని వ్యాఖ్యనించారు.

కమల్ నాథ్ అశోక్ నగర్  కు వచ్చి నన్ను కుక్క అని అన్నారు. కమలా నాథ్ జి దయచేసి వినండి అవును, నేను కుక్కను ఎందుకంటే నా యజమాని ఈ జనం. నేను నా యజమానికి సేవ చేస్తున్నాను. అవును నేను కుక్కను ఎందుకంటే అది తన  యజమానిని రక్షిస్తుంది. ఎవరైనా అవినీతి,అక్రమాలకు పాల్పడితే  ఈ కుక్కే  ఆ వ్యక్తిని కొరుకుతుందంటూ హెచ్చరించారు.

కాగా ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి  సింధియా బీజేపీలో చేరారు. ఆయన రాజీనామా తరువాత మధ్యప్రదేశ్‌లోని 22 మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -సింధియా విధేయులు బీజేపీలో చేరారు. ఇది రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం పతనానికి దారితీసింది.

 

Latest Updates