గ్లామర్ రోల్స్ కి నేను రెడీ

విశ్వంత్, సంజయ్ రావు, నిత్యాశెట్టి కీలక పాత్రల్లో చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కినచిత్రం ‘ఓ పిట్టకథ’. సినిమాకి లభిస్తున్న స్పం దన గురించి నిత్య మాట్లాడుతూ ‘అంజి, దేవుళ్లు సినిమాల తర్వాత కూడా కొన్ని సినిమాల్లో బాలనటిగా చేశాను కానీ ‘దేవుళ్లు’ సినిమాతో వచ్చిన గుర్తింపు ఏ సినిమాకీ రాలేదు. టెన్త్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా చదువుపైనే శ్రద్ధపెట్టాను. నేను పెరిగింది, చదువుకుంది అంతాహైదరాబాద్‌ లోనే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యు నికేషన్స్‌ లో బీటెక్ చేశాను. నేను గతంలో చేసిన కొన్నిసినిమాల్లో చెప్ పిన స్టోరీ ఒకటి, చేసేది మరొకటి. కానీ ఈ సినిమాని మాత్రం ఎలా చెప్పా రో అలానే తీశారు చెందు. క్లైమాక్స్‌లో వచ్చే సస్పెన్స్‌ కి ఆడియెన్స్ థ్రిల్‌‌ ఫీలయ్యారు. పాజిటివ్ టాక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఎలానటించినా…లీడ్ యాక్టర్‌ గా చేసే టప్పుడు ప్రతిసీన్‌‌లోనూ అందంగా కనిపించాలి . నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. మూడు నాలుగు పాత్రల చుట్టే తిరుగుతుంది. నేను చేసిన వెంకటలక్ష్మి పాత్రకు మంచి మార్కులు వచ్చాయి. తమిళంలో ఓ సినిమా సైన్ చేశాను. తెలుగులోఇంకా ఏదీ ఒప్పుకోలేదు. మంచి కథలు వస్తే నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. గ్లామర్ రోల్స్ ఇప్పటి వరకు ఎవరూ ఆఫర్ చేయలేదు. వస్తే చేయడానికి రెడీ’ అని చెప్పిం ది.

Latest Updates