నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి నేను రెడీ: పవన్

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తాను రెడీ అని చెబుతున్నాడు మీరట్ జైలు తలారి పవన్. ఆ నలుగురు దుర్మార్గులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు మరణ శిక్ష విధించాలని పాటియాలా కోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో తలారి లేకపోవడంతో వాళ్లను ఉరి తీసే అవకాశం తనకు వస్తే అందుకు చాలా సంతోషిస్తానని మీరట్ జైలు తలారి పవన్ తెలిపాడు. ఇంకా తనను జైలు అధికారులెవరూ ఈ విషయంపై సంప్రదించలేదన్నాడు. ఆ నలుగురిని ఉరి తీయాలని తనను ఆదేశిస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పాడు. ఆ నలుగురు దుర్మార్గులకు మరణ శిక్ష  అమలు చేయడం ద్వారా తనతో పాటు నిర్భయ తల్లిదండ్రులు, దేశ ప్రజలంతా సంతోషిస్తారని అన్నాడు.

నిర్భయ దోషులు ఉన్న తీహార్ జైలులో వాళ్లను ఉరి తీయడానికి తలారి లేకపోవడంతో గతంలోనే జైలు అధికారులు యూపీలోని మీరట్ జైలుకు లేఖ రాసింది. అక్కడ తలారిగా పని చేస్తున్న పవన్‌ను తీహార్‌కు పంపేందుకు యూపీ అధికారులు అంగీకారం తెలిపినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

More News:

దిశ తరహా ఘోరం!: 17 ఏళ్ల అమ్మాయి దహనం.. గ్యాంగ్ రేప్‌పై అనుమానాలు

ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు లక్ష చొప్పున నజరానా

మగవాళ్లే ఇంట్లో కూర్చుంటే.. అమ్మాయిలు సేఫ్: మహిళ వీడియో వైరల్

నిర్భయ తల్లిదండ్రులకు సెల్యూట్

Latest Updates