హీట్ జోన్ లో తెలంగాణ : మే లో మాడు పగిలే ఎండలు

తెలంగాణలో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో హీట్ వేవ్ మరింతగా పెరగనుంది. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో గతేడాదితో పోల్చితే మరింతగా ఎండకొడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఏప్రిల్ – జూన్ సీజన్ లో ఉష్ణోగ్రతలను అంచనా వేసింది భారత వాతావరణ హెచ్చరికల కేంద్రం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ స్టేట్… హీట్ వేవ్ జోన్ లో ఉందని ప్రకటించింది. గతేడాది రికార్డులతో పోల్చితే… ప్రతి ప్రాంతంలో 0.5 శాతం నుంచి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని వివరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదు అవుతాయని హెచ్చరించింది. కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 43కి పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయనీ… హైదరాబాద్ లో 40 డిగ్రీల పైనే టెంపరేచర్ ఉంటుందని తెలిపింది కేంద్ర వాతావరణ హెచ్చరికల కేంద్రం.

ఇవాళ రాష్ట్రంలో గరిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఆదిలాబాద్(బేలా) – 42.6 డిగ్రీల సెల్సియస్

కామారెడ్డి(మఖ్దుంపూర్) – 42.5

కుమరం భీమ్ ఆసిఫాబాద్(వాంకిడి)- 42.5

వనపర్తి (ఆత్మకూరు) – 42.4

భద్రాద్రి కొత్తగూడెం(ఈ బయ్యారం) – 42.3

కరీంనగర్ (జమ్మికుంట) – 42.2

మహబూబ్ నగర్ (మాచంపల్లి) – 42.2

వికారాబాద్ (తాండూరు) – 42

జోగులాంబ గద్వాల (ధరూర్) – 41.8

ఆదిలాబాద్ (భొరాజ్)- 41.8

Latest Updates