తుఫాన్ల‌కు భార‌త్ 13 పేర్లు

హుద్ హుద్.. తిత్లీ.. ఇలా తుఫాన్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక్కో కొత్త పేరు పెడుతుంటుంది భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD)‌. అయితే ఈ పేర్ల‌ను అప్ప‌టిక‌ప్పుడే అనుకుని పేట్టేవేం కాదు. వివిధ దేశాల్లో వ‌చ్చే తుఫాన్లకు సంబంధించి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో పాటు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, ఆ తుఫాన్ల‌కు పేర్ల‌ను సూచించేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరు రీజిన‌ల్ స్పెష‌లైజ్డ్ మెటోర‌లాజిక‌ల్ సెంట‌ర్లు (RSMC), ఐదు రీజిన‌ల్ ట్రాపిక‌ల్ సైక్లోన్ సెంట‌ర్లు (TCWC) ఉన్నాయి. భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) ఈ ఆరు రీజిన‌ల్ స్పెష‌లైజ్డ్ మెటోర‌లాజిక‌ల్ సెంట‌ర్ల‌లో ఒక‌టిగా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో భార‌త్ స‌హా 13 స‌భ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాల‌న్నీ ఏటా ఒకసారి 13 చొప్పున పేర్ల జాబితాను ఇస్తాయి. అంటే మొత్తం 169 పేర్ల లిస్టును సిద్ధం చేస్తాయి. వీటిని ఆయా దేశాల్లో రాబోయే తుఫాన్ల‌కు వ‌రుస‌గా ఒక్కో పేరును పెడుతూ వ‌స్తాయి. ఈ ఏడాదికి సంబంధించి భార‌త్ 13 పేర్ల లిస్ట్ ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

మ‌న RSMCలోని 13 స‌భ్య దేశాలివే:

భార‌త్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవ్స్, మ‌య‌న్మార్, ఒమ‌న్, పాకిస్థాన్, ఖ‌తార్, సౌదీ అరేబియా, శ్రీలంక‌, థాయ్ లాండ్, దుబాయ్, యెమెన్.

భార‌త్ ఇచ్చిన 13 పేర్లు

గ‌తి, తేజ్, ముర‌సు, ఆగ్, వ్యోమ్, ఝార్, ప్రొబ‌హో, నీర్, ప్ర‌భంజ‌న్, ఘుర్ని, అంబుద్, జ‌ల‌ధి, వేగ‌.

Latest Updates