పాస్ బుక్ లేని వారికి రుణమాఫీ అమలు చేయాలి

  • కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి

పాస్​బుక్​లులేని రైతు లకు రుణమాఫీ అమలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. లక్ష లోపు రుణమాఫీ అర్హత ఉన్న చాలామంది రైతులకు ఇప్పటికీ పాసుబుక్​లు అందలేదన్నారు. వీరందరిని గుర్తించి వారికి రుణమాఫీ వర్తింపజేయాలన్నారు. గురువారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీతో రైతులకు ఎలాంటి ప్రయోజనంలేదని, ఐదేళ్లుగా బ్యాంకులు వడ్డీ వసూలు చేయటంతో ఆ భారమంతా రైతులపై పడిందన్నారు. నిధులు మొత్తానికి ప్రభుత్వమే గ్యారంటీ  ఇచ్చి రుణమాఫీ చేయాలని సూచించారు.

Latest Updates