మెడ..కాళ్లు చూపిస్తే నగ్నత్వం అంటారా..? ఫోటో షూట్ పై స్పందించిన వధూవరులు

పెళ్ళికి ముందు జరిగే ఫోటో షూట్ లకు ఈ మధ్య డిమాండ్ పెరిగింది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కాబోయే వధూవరులు ఫోటోలకు పోజులిస్తూ వారెవా అనిపిస్తున్నారు.

అయితే లాక్ డౌన్ కారణంగా ఫోటో షూట్ లకు అనుమతి లేకపోవడంతో కొంతమంది వధూవరులు పెళ్లి తరువాత ఫోటో షూట్లో పాల్గొంటున్నారు.

తాజాగా కేరళకు చెందిన రిషి కార్తికేయన్, లక్ష్మిలు సెప్టెంబర్ 15న వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే ఫోటో షూట్ లో పాల్గొనాల్సి ఉండగా..లాక్ డౌన్ కారణంగా సాధ్యపడలేదు. దీంతో పెళ్లి తరువాత ఫోటో షూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దానికి కారణం వెడ్డింగ్ షూట్ లో వధువు వరుడు ధరించిన క్యాస్టూమ్సే.

కార్తికేయన్ స్నేహితుడు ఫోటోగ్రాఫర్ అఖిల్ కార్తికేయన్ సాయంతో కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వాగామోన్ లోని టీ తోటల్లో ఫోటో షూట్ నిర్వహించారు. తెల్లని దుస్తుల్లో రిషి, లక్ష్మిలు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అనంతరం ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఆ ఫోటోలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ పై రిషి స్పందించారు. వెడ్డింగ్ షూట్ లో అన్నీ రకాల క్యాస్టూమ్స్ ధరించాం. చివరికి ఈ క్యాస్టుమ్స్ తో ఫోటో షూట్ లో పాల్గొన్నాం.

కానీ నెటిజన్లు, బంధువులు నాలుగుగోడల మధ్య చేయాల్సింది బహిరంగంగా ఎందుకు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని అన్నారు. నన్ను నా కుటుంబంపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. లోదుస్తులు ధరించారా అంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడ, కాళ్లను చూపించడం నగ్నంత్వం  అనడం సమంజసం కాదన్న వధువు లక్ష్మీ..ఎవరు ఏమన్నా తాము సోషల్ మీడియాలో షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటో షూట్లను డిలీట్ చేయమని స్పష్టం చేసింది. ఇక నెటిజన్ల ట్రోల్స్ పై తాము స్పందించాల్సిన అవసరం లేదంటూ వధూవరులు రిషి, లక్ష్మిలు మీడియాకు వెల్లడించారు.

 

Latest Updates