టిక్ టాక్ అండగా..ప్లే స్టోర్ నుంచి 5మిలియన్ల రివ్యూస్ ను డిలీట్ చేసిన గూగుల్

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు గూగుల్ అండగా నిలిచింది. యాప్ ను బ్యాన్ చేయాలని ఇస్తున్న రివ్యూస్ ను గూగుల్ యాప్ స్టోర్ నుంచి తొలగించింది.

గత కొద్దిరోజులుగా దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. హింసను ప్రోత్సహించేలా టిక్ టాక్ వీడియోలు ఉన్నాయంటూ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ లో యాప్ కు దారుణమైన రేటింగ్ ఇస్తున్నారు. అంతేకాదు బ్యాన్ టిక్ టాక్ ఇండియా యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో యాప్ రేటింగ్ 4నుంచి ఒక్కసారిగా రెండుకి ..రెండు నుంచి 1.2కి దిగజారింది . ఎన్నడూ లేనంతగా యాప్ రివ్యూస్ పడిపోవడంతో టిక్ టాక్ మాతృ సంస్థ బిట్ టు బైట్ రివ్యూ నిర్వహించింది. తాజాగా 1.2 ఉన్న రేటింగ్ కాస్తా 1.5కి పెరిగినట్లు అందులో  22మిలియన్ యూజర్స్ రివ్యూ ఇచ్చినట్లు తేలింది.

అయితే యాప్ రేటింగ్ పెరగడానికి కారణం గూగుల్  అని తెలుస్తోంది. ట్విట్టర్ సర్టిఫైడ్ యూజర్ నార్బెర్ట్ ఎలెక్స్  ట్వీట్ చేశారు.  రాత్రి వేళల్లో టిక్ టాక్ కు మిలియన్ రివ్యూస్ ను గూగుల్ డిలీట్ చేసిందని,  అందుకేనేమో ఓవర్ నైట్ లో టిక్ టాక్ రేటింగ్ 1.6కి పెరిగినట్లు  అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఎలెక్స్ చేసిన ట్వీట్ లో ప్లేస్టోర్ లో  28 మిలియన్ రివ్యూస్ ఉన్నాయి.  రేటింగ్ 1.2గా ఉంది.   మరో స్క్రీన్ షాట్ లో  1.6 రేటింగ్ తో  27 మిలియన్ రివ్యూ చేసినట్లు గా ఉంది. అంటే  గత వారం నుండి ఐదు మిలియన్ల వినియోగదారుల రివ్యూస్ లను గూగుల్ తొలగించినట్లైంది. అయితే ఈ రివ్యూస్ తొలగించడానికి గూగుల్ కారణం చెప్పలేదు. దీంతో టిక్ టాక్ యాప్ రేటింగ్ పెరిగింది.

Latest Updates