భారత్ లో అరాచకం అంటూ… బంగ్లాదేశ్ వీడియో షేర్ చేసిన పాక్ ప్రధాని

భారత్… పౌరసత్వ చట్టం తెచ్చినప్పటినుంచి అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్తాన్. తాజాగా.. ఉత్తర ప్రదేశ్ ముస్లింలను హింసిస్తున్నారంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రన్ ఖాన్. అయితే ఆ వీడియో ఫ్యాక్ట్ చెక్ చేయగా అది బంగ్లాదేశ్ కు చెందినదిగా తేలింది. ఆ వీడియోలోని పోలీసులు వేసుకున్న యూనిఫాంపై RABఅని రాసివుంది. అంటే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అని అర్థం. అది బంగ్లాదేశ్ ఉగ్రవాద నిరోదక విభాగానికి చెందినది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఇమ్రన్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. ముందు పాకిస్తాన్ ప్రజల బాగోగులు చూసుకోవాలని… హితవు పలుకుతున్నారు.

పోలీసుల యూనిఫాంను చూసి… చదువుకునే పిల్లలు సైతం వాళ్లు ఏదేశానికి చెందిన వారో చెప్తారని.. అయితే పాకిస్తాన్ ను పరిపాలిస్తున్న ఇమ్రన్ ఖాన్ కు కనీసం వీటిపైన అవగాహన ఉండటంలేదని చెప్పారు. కావాలనే భారత్ లో హింసను రెచ్చగొట్టేలా ఆయన చేస్తున్నారని అన్నారు. నెటిజన్లు నిజం తెలుసుకుని ప్రశ్నిస్తుండటంతో ట్వీట్ ను డిలీట్ చేశారు ఇమ్రన్ ఖాన్.

Latest Updates