పుల్వామా దాడి వెనక పాక్ : శివసేన

imran-khans-comment-on-scrapping-article-370-proves-pakistans-involvement-in-pulwama-attack-sena

జమ్ము కాశ్మీర్ లో  ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను తప్పబట్టింది శివసేన.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పుల్వామా తరహ దాడులు జరగొచ్చనే ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడింది. దీన్ని బట్టి పుల్వామా దాడి వెనక పాక్ హస్తం ఉందని ఇమ్రాన్ ఖాన్ చెప్పకనే చెప్పాడని తన అధికార పత్రిక సామ్నాలో వెల్లడించింది. ఇండియాతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం, పాక్ లో భారత రాయబారిని తిప్పిపంపడం వంటి వాటితో పాక్ కే ఎక్కువ నష్టమని .. ఇండియాకు వచ్చిన నష్టమేమి లేదని చెప్పింది. పాక్ ఓ వైపు చర్చలంటూ మరో వైపు కుట్రలు పన్నుతుందని ఆరోపించింది శివసేన.

Latest Updates