సెహ్వాగ్ కంటే టాలెంటెడ్.. కానీ బుర్ర లేదు: అక్తర్

కరాచీ: ఇండియా లెజెండరీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌కంటే టాలెంటెడ్‌‌ అయినప్పటికీ పాకిస్థా న్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్‌కు బుర్ర లేదని ఆ దేశమాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌‌లో మంచి ఆరంభం దక్కించు కున్న నజీర్.. టెంపర్మెంట్, బ్రెయిన్ లేకపోవడం వల్లే సక్సెస్ కాలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. కనీసం పీసీబీ ఇమ్రాన్‌‌ను తీర్చిదిద్దినా సెహ్వాగ్‌ కంటే బెటర్ ప్లేయర్ అయ్యేవాడని అన్నాడు. ఇండియాతో ఓ మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతనికి చాన్స్లు ఇవ్వాలని తాను సూచిస్తే బోర్డు పట్టించుకోలేదన్నాడు.. ‘మా దగ్గరున్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం మా దురదృష్టకరం. ఇమ్రాన్ నజీర్ రూపంలో మాకు సెహ్వాగ్ కంటే బెటర్ ప్లేయర్ అని  ఉండేవాడు. అతను అన్ని రకాల షాట్లు ఆడేవాడు. మంచి ఫీల్డర్ కూడా. అతడిని మేం చక్కగా సద్వినియోగం చే సుకోవ్సాలిం ది. కానీ, అలా జరగలేదు’ అన్నాడు.

 

Latest Updates