హైద‌రాబాద్ డాక్టర్ల అద్భుతం : దేశంలో తొలిసారి క‌రోనా పేషెంట్ కు డ‌బుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్

దేశంలో తొలిసారి క‌రోనా సోకిన పేషెంట్ కు డ‌బుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేసిన‌ట్లు హైద‌రాబాద్ కు చెందిన డాక్ట‌ర్లు తెలిపారు.

చండీగఢ్ కు చెందిన రిజ్వాన్ (32) కు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ లోపం వ‌ల్ల స‌ర్కోయిడోసిస్ అనే వ్యాధిసోకింది. ఈ వ్యాధి సోకిన బాధితులు శ‌రీరంలో ఉన్న అన్నీ ఆర్గాన్స్ మెల్ల మెల్ల‌గా దెబ్బ‌తింటాయి. రిజ్వాన్ కు కూడా ఈ స‌ర్కోయిడోసిస్ వ‌ల్ల రెండు లంగ్స్ దెబ్బ‌తిన్నాయి. దీంతో అనారోగ్య స‌మ‌స్య తీవ్రంగా మారింది.

అత్య‌వస‌ర ట్రీట్మెంట్ కోసం బాధితుడి బందువుల స‌హ‌కారంతో హైద‌రాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యారు. తాజాగా బాధితుడు రిజ్వాన్ కు స‌ద‌రు ప్రైవేట్ ఆస్ప‌త్రికి చెందిన డాక్ట‌ర్ సందీప్ అత్వార్ బృందం లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఆపరేష‌న్ విజ‌యంవంతం చేశారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ సందీప్ అత్వార్ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా క‌రోనా సోకిన బాధితుడికి విజ‌య‌వంతంగా డ‌బుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేసిన‌ట్లు చెప్పారు.

స‌ర్కోయిడోసిస్ వ‌ల్ల బాధితుడికి నిమిషానికి 15 నుంచి 50 లీట‌ర్ల ఆక్సిజ‌న్ ను 8వారాల పాటు అందించామ‌న్నారు. 8వారాల అనంత‌రం లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేశామ‌ని డాక్ట‌ర్ సందీప్ తెలిపారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం బాగుంద‌న్నారు.

Latest Updates