డేరింగ్ లేడీ పైలట్స్ : తొలిసారి డోర్నియర్ విమానం నడిపారు

హర్యానా : భారతీయ మహిళా లోకం పులకించి పోయే సంఘటన. హర్యానాలోని సిర్సా ఎయిర్ బేస్ లో ఎయిర్ ఫోర్స్ ఉమెన్ వింగ్ కు సంబంధించిన చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కారమైంది. ఇద్దరు ఎయిర్ ఫోర్స్ లేడీ పైలట్స్.. డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. మహిళ అధికారుల బృందం … ప్యారలల్ ట్యాక్సీ ట్రాక్ టేకాఫ్, ల్యాండింగ్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించింది. మహిళా ఎయిర్ ఫోర్స్ పైలట్లకు డైరెక్షన్స్ ఇచ్చింది. స్క్వాడ్రాన్ లీడర్ కమల్ జీత్ కౌర్ ఈ ఆపరేషన్ లో కెప్టెన్ గా వ్యవహరించారు. స్క్వాడ్రాన్ లీడర్ రాఖీ భండారీ కో – పైలట్ గా వ్యవహరించారు.

ఎయిర్ ఫోర్స్ లో ప్యారలల్ ట్యాక్సీ ట్రాక్ ఆపరేషన్స్ చాలా కష్టమైనవి. కీలకమైనవి. రన్ వే అందుబాటులో లేకపోయినా కూడా విమానాన్ని టేకాఫ్ … ల్యాండింగ్  చేస్తుంటారు. ఎంతో రిస్క్, ఛాలెంజ్ తో కూడిన ప్యారల్ ట్యాక్సీ ట్రాక్ ఆపరేషన్ ను మహిళా పైలట్లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారని ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు.

ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు బెంగళూరులో ఎయిరో ఇండియా 2019 ప్రదర్శన జరగబోతోంది. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోభివృద్ధి.. ఈ ప్రదర్శనలో హైలైట్ కానుంది.

Latest Updates