NDRF లో 100 మంది మహిళలతో మొదటి దళం

పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు మహిళలు. తాజాగా జాతీయ విపత్తు నిర్వహణా దళంలో (NDRF) కి ప్రవేశించిన మహిళలు మేము సైతం అంటూ తమ సత్తాను నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు NDRF లో కేవలం పురుషులు మాత్రమే పని చేసేవారు. కానీ ఇకనుండి జాతీయ విపత్తు నిర్వహణ దళంలో మహిళలు కూడా విధులు నిర్వహించనున్నారు.

అందులో భాగంగా 100 మందితో కూడిన మొదటి మహిళా బృందం విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని NDRF దళంలోకి చేరింది. ట్రైనింగ్ పొందిన ఈ టీం అప్పుడే రంగంలోకి కూడా దిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలోని గంగా నది ఒడ్డున వారు విధులను నిర్వహిస్తున్నారు. 100 మంది మహిళా బృందంతో కూడిన NDRF  సిబ్బందిని ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది ఒడ్డున విధుల్లో నియమించినట్లు సీనియర్ ఫోర్స్ అధికారి తెలిపారు.

NDRF  పోరాట బృందాలలో మహిళా సిబ్బందిని తీసుకునే చర్య కొంతకాలంగా పరిశీలనలో ఉంది. గత కొన్ని నెలలుగా 100 మందికి పైగా మహిళా సిబ్బంది NDRF లో చేరారు . వారు తమ ప్రీ-ఇండక్షన్ కోర్సు తో పాటు ట్రైనింగ్ ను పూర్తి చేసిన వెంటనే దేశవ్యాప్తంగా దాని బెటాలియన్‌లలో నియమించబడ్డారు అని డిజి తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 200 మంది మహిళా సిబ్బందికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

Latest Updates