కొత్త దారిలో.. ప్రగ్యా జైస్వాల్

అందం ఉన్నా అదృష్టం లేదు ప్రగ్యా జైస్వాల్‌ కి. ఈ మాట ఇప్పటికే చాలామంది అన్నారు. ‘కంచె’ లాంటి మంచి సినిమాలో నటించినా ఆమెకి అవకాశాలు రాకపోవడమే అందుకు కారణం. రీసెంట్‌ గా పవన్ కళ్యాణ్, క్రిష్‌ ల సినిమాలో ఏదో పాత్ర వచ్చిందని అన్నారు కానీ నిజమో కాదో ఇంకా తెలియలేదు. అయితే ఒకదాన్నే నమ్ముకుని కూర్చోవడం ఎందుకనుకుం దో ఏమో.. కొత్త దారిలో వెళ్లా లని డిసైడయ్యింది ప్రగ్య. ఒక యూట్యూబ్ చానెల్ పెట్టింది. తన చానెల్‌ లో ఫుడ్, హెల్త్, ట్రావెల్, ఫిట్‌ నెస్‌ , యోగా వంటి మంచి మంచి విషయాల్ని చూపిస్తుందట. ‘మీరు చూసి ఊరుకోకండి. అందరికీ షేర్ చేయండి, సబ్‌‌‌‌స్క్రైబ్ చేయండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. నిజానికి లాక్‌ డౌన్ మొదలయ్యాక చాలామంది సొంత యూట్యూబ్ చానెల్స్ పెట్టారు. కొందరు యోగా పాఠాలు చెబుతున్నారు. మరికొం దరు వంటలు నేర్పిస్తు న్నారు. ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రగ్య కూడా అదే పని చేసింది. ఆమె ఈ లైన్‌‌‌‌లో ఎంతవరకు సక్సెస్‌ అవుతుం దోనని చూద్దామని అందరూ క్యూరియస్ గా ఉన్నారు.

Latest Updates