ఆస్తి తగాదాలు…కత్తితో ఇద్దరిని పొడిచేశాడు

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామంలో కత్తితో దాడిలో ఇద్దరు మృతి

పెబ్బేర్: తల్లిదండ్రులు ఏ ముహూర్తంలో పరుశురాముడు అనే పేరు పెట్టారో గాని.. అదే పేరు గల వ్యక్తి ఆస్తి తగాదాలో.. విచక్షణ కోల్పోయి నిజంగానే పరుశురాముడిలా మారాడు..  ఆగ్రహంతో కత్తి తీసుకుని ఇద్దరిపై దాడి చేసి.. పొడిచి చంపేశాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వై.శాఖాపూర్ గ్రామంలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఆస్తుల వాటాల విషయంలో కొద్ది రోజులుగా పేచీ పడింది. ఈ తగాదాలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెద్దగా మారాయి. పరశురాముడు(32) అనే వ్యక్తి… శాంతన్న(55), రామకృష్ణ (24) అనే ఇద్దరి పై దాడి చేశాడు. ఊహించని విధంగా కత్తి తీసుకుని దాడి చేయడంతో తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని  వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్త స్రావం కావడంతో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్.ఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.

Latest Updates