అమరావతిలో త్వరలో సీఎంగా ప్రమాణం చేస్తా: పవన్ కల్యాణ్

YCP అధినేత వైఎస్ జగన్‌ను….జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదన్నారు. పేపర్, ఛానల్ ఉన్నాయని YCP పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి పైనా విరుచుకుపడ్డారు. ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్ అనుమతితో YCP  బీఫారాలు ఇస్తోందని పవన్ విమర్శించారు. కృష్ణా జిల్లాలోని కైకలూరులో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలోనే సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు జగన్, చంద్రబాబులే చేస్తారా? తాను చేయలేనా? అని అన్నారు పవన్.

 

Latest Updates