ఈ 328 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు రేపిస్ట్ లు, 375మంది కోటీశ్వరులు

మరికొద్దిరోజుల్లో జరిగే బీహార్ మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధుల్లో రేపిస్ట్ లు, కోటీశ్వరులున్నట్లు డేటా వెలుగులోకి వచ్చింది

243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల వారీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇక మొదటి దశలో అక్టోబర్ 28న 71 అసెంబ్లీ స్థానాలకు , రెండో దశ నవంబర్ 3న 94 అసెంబ్లీ స్థానాలకు , నవంబర్ 7న 78అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 7.29కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా అందులో లక్షమంది తొలిసారి ఓటేయనున్నారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 9న వెలువడనున్నాయి.

రేపిస్ట్ లు , కోటీశ్వరులు

ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసిన చిన్న చిన్న పార్టీల నుంచి జాతీయ స్థాయి పార్టీల అభ్యర్ధుల చరిత్రపై కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన 1066మంది ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో 1064 మంది నామినేషన్ల అఫిడవిట్ల ను పరిశీలించగా అందులో మొత్తం 375మంది కోటీశ్వరులున్నట్లు తేలింది. 328మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు బీహార్ మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో 23శాతం మందిపై ద్రోహం, మర్డర్, కిడ్నాప్, రేప్ కేసులు నమోదైనట్లు అఫిడవిట్లు సమర్పించారు.

క్రిమినల్ కేసులు ఏ పార్టీ  అభ్యర్ధులపై ఉన్నాయంటే

ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రిపోర్ట్ ఆధారంగా లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ రాస్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్ధులు క్రిమినల్ కేసుల్లో తొలిస్థానంలో ఉంటే బీజేపీ అభ్యర్ధులు రెండవ స్థానంలో ఉన్నారు.

ఆర్జేడీకి చెందిన 41మంది అభ్యర్ధుల్లో 30మంది అంటే 73శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదు కాగా బీజేపీకి చెందిన  29మంది అభ్యర్ధుల్లో 21మంది అంటే 72శాతం మంది అభ్యర్ధులపై క్రిమినల్ చరిత్ర ఉంది. ఇక చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్పీజీ) కి చెందిన 21మందిలో 12మందిపై, కాంగ్రెస్ కు చెందిన 35మందిలో 15మందిపై, జేడీయూకి చెందిన 26మందిలో 6మందిపై  క్రిమినల్ కేసులున్నట్లు అభ్యర్ధులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్నట్లు ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రిపోర్ట్ విడుదల చేసింది.

Latest Updates