కెనడాలో మష్రూమ్స్ తింటే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే

జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు మనసు ఎటెటో వెళ్లిపోవడం. ఇలా హెల్యూజినేషన్ కలిగించే వాటిలో మ్యాజిక్ మష్రూమ్స్ కూడా ఒకటి! వీటిని తింటే చాలు ఊహల్లో తేలుతు ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మత్తుకోసం బానిసలు డ్రగ్స్ ఎలా తీసుకుంటారో…అదే డ్రగ్ తరహాలో ఉండే మష్రూమ్స్ ను తినేందుకు ఇష్టపడుతుంటారు. మ్యాజిక్ మష్రూమ్స్ లో సిలోసిబిన్ అనే మత్తు పదార్ధం ఉంటుంది. ఆ మత్తు పదార్ధం ఉన్న మష్రూమ్స్ తినడం వల్ల ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తారని యూకే నేషనల్ హెల్త్ సర్వే తెలిపింది. అంత ప్రమాదకరమైన మ్యాజిక్ మష్రూమ్స్ వినియోగం నిషేదంలో ఉంది. కెనడాతో సహా మిగిలిన దేశాల్లో  ఈ మష్రూమ్స్ ను తింటే కఠిన చర్యలు తప్పవ్ . అయితే కెనడాలో ఈ మ్యాజిక్ మష్రూమ్స్  చట్టబద్ధత కల్పిస్తూ ఆదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారు ఈ మ్యాజిక్ మష్రూమ్స్ తినేందుకు అనుమతివ్వడం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల కెనడాలో ట్రీట్మెంట్ చేసినా నయం కాని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో అలాంటి వారికి ఉపశమనం కలిగించేందుకు  మ్యాజిక్ మష్రూమ్ ను తినేందుకు కెనడా ప్రభుత్వం అనుమతిచ్చింది.

Latest Updates