ప్రతి ఐదుగురిలో ఒకరి ఉద్యోగం మాయం

  • అమెరికాలో పెరుగుతున్న అన్ ఎంప్లాయిమెంట్

వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ తో ఆగమాగమవుతున్న అమెరికాలో మరో క్రైసెస్ మొదలైంది. ఈ మహమ్మారి ప్రభావంతో లక్షలాది మంది జాబ్స్ కోల్పోతున్నారు. ప్రతి ఐదు మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నట్లు అన్ ఎంప్లాయ్ మెంట్ లెక్కల్లో తేలింది. వచ్చే ఏడాది నాటికి అన్ ఎంప్లాయ్ మెంట్ రేటు 10 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. 2008- 2009 లో అమెరికాలో రిసిషన్ కారణంగా కోట్లాది మంది జాబ్స్ కోల్పోయారు. ఆ సమయంలో గరిష్టంగా 10 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఆనాటి పరిస్థితులు ఎదురువుతున్నాయని అమెరికన్లలో ఆందోళన మొదలైంది. దీంతో అమెరికన్ల ఉద్యోగాలకు ఎలాంటి సమస్య లేకుండా ఇప్పటికే ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు. రెండు నెలల పాటు యూఎస్ కు ఇతర దేశాల నుంచి మైగ్రేషన్స్ లేకుండా చర్యలు చేపట్టారు. కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. కరోనా క్రైసెస్ మరి కొన్ని నెలలు కొనసాగితే అన్ ఎంప్లాయ్ మెంట్ రేటు మరింత దిగజారుతుందని ఎకనామిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ల ఉద్యోగ భద్రత కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 1930 లో ఏర్పడిన గ్రేట్ రిసిషన్ లో యూఎస్ లో అన్ ఎంప్లాయ్ దారుణంగా పెరిగిపోయింది. 14 నుంచి 25 శాతం వరకు నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రస్తుత పరిస్థితి ఆనాటి సంక్షోభంతో పోల్చుతున్నారు ఎకనామిస్ట్ లు.

 

Latest Updates