50 వేల ఇండ్లకు కరెంట్​ కట్​

హైదరాబాద్‌‌, వెలుగు: వాన బీభత్సంతో హైదరాబాద్‌‌లోని చాలా కాలనీలు చీకటిలో మగ్గుతున్నాయి. వారం రోజులైనా కరెంటు సిస్టమ్‌‌ను ఆఫీసర్లు  పునరుద్ధరించలేదు. సిటీలోని 166 ట్రాన్స్ ఫార్మర్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఇంకా స్టార్ట్​ కాలేదు. దీంతో సుమారు 50 వేల  ఇండ్లకు కరెంట్​ నిలిచిపోయింది. కాలనీలు, వీధుల్లో వరద నీరు ఇంకా ఉండటం, అపార్ట్‌‌మెంట్ల సెల్లార్లు నీట మునగడంతో కరెంట్ సరఫరా అందించలేకపోతున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు. హఫీజ్‌‌బాబా నగర్‌‌లో 20 పంపిణీ ట్రాన్స్‌‌ఫార్మర్లు, నదీమ్ కాలనీలో 7 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 64 విద్యుత్‌‌ స్థంభాలు నేల కూలాయి. దీనికి తోడు సిటీ పరిధిలోని అపార్ట్‌‌మెంట్ సెల్లార్లు, వీధుల్లో ఇంకా నీళ్లుండటంతో 139 ట్రాన్స్‌‌ఫార్మర్లలో సప్లయ్ నిలిపేశామని డిస్కం వర్గాలు చెప్పాయి. వరద ఉధృతి తగ్గగానే కరెంట్​ సరఫరా కొనసాగిస్తామని పేర్కొన్నారు. మళ్లీ వర్షాలు పడే చాన్స్‌‌ ఉండటంతో గ్రేటర్‌‌  హైదరాబాద్​లో 189 సెక్షన్ స్థాయి డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ టీంలను 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నామని ఆఫీసర్లు చెప్పారు.  ఒక్కో టీమ్‌‌లో 25 మంది స్టాఫ్​ ఉంటారు.

జాగ్రత్తగా ఉండండి: రఘుమారెడ్డి

వాన పడుతున్నందున విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ ఫార్మర్లను జనం తాకొద్దని టీఎస్​ ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 7382072104, 7382072106,7382071574 కు ఫోన్​ చేయొచ్చన్నారు.

Latest Updates