ఆన్ లాక్ తో సీన్ రివర్స్ .. ఏం కొన్నా డబ్బులే ఇస్తున్నారు

  • తగ్గిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్
  • సిటీలో 68.3% క్యాష్ పేమెంట్స్
  • ఆన్ లైన్ ఆర్డర్స్​కి కూడా క్యాష్ ఆన్ డెలివరీనే..
  • ఎటీఎం సెంటర్ల దగ్గర పెరుగుతున్న రద్దీ
  • మెట్రో సిటీల్లో రేజర్ పే సర్వే

హైదరాబాద్, వెలుగుకరోనాకి ముందు సిటీలో ఏం కొనాలన్నా, ఏ బిల్లు కట్టాలన్నా కార్డ్, ఆన్​లైన్ పేమెంట్ కంటే క్యాష్ ఎక్కువగా యూజ్​ చేసేవాళ్లు. వైరస్ ​ఎఫెక్ట్, లాక్ డౌన్​తో దాదాపు అంతా ఆన్​లైన్​ పేమెంట్స్ మొదలుపెట్టారు. అన్​లాక్​తో ఈ పరిస్థితి మళ్లీ మారుతున్నట్లు చెప్తోంది రేజర్​పే ఆన్​లైన్​ పేమెంట్స్ సింప్లిఫైడ్ కంపెనీ. అన్ లాక్ మొదలయినప్పటి నుంచి బిల్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ మెథడ్​పై ఈ సంస్థ మూడు మెట్రో పాలిటిన్ సిటీల్లో సర్వే చేసింది. ప్రీ లాక్ డౌన్​కి ముందులాగే ఎక్కువమంది క్యాష్ పేమెంట్స్​​ చేస్తున్నట్లు అందులో తేలింది. ఢిల్లీ మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

లాక్ డౌన్​లో ఇలా..

మార్చిలో లాక్ డౌన్ మొదలైంది. కరోనా కేసులు రోజురోజుకి పెరగడంతో జనం గ్రాసరీ నుంచి షాపింగ్ వరకు ఏదీ కావాలన్నా ఆన్​లైన్​లోనే ఆర్డర్ చేసుకున్నారు. పేమెంట్స్ ​కూడా క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా డిజిటల్​గా చేశారు. బయటకు వెళ్లినా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ కే మొగ్గు చూపారు. దాంతో మాములు రోజులతో చూస్తే లాక్ డౌన్​లో ఆన్​లైన్ పేమెంట్స్ 5 శాతం పెరిగినట్లు ఫినో ఆన్​లైన్​ పేమెంట్స్ కంపెనీ పేర్కొంది. 180 నుంచి 190శాతం పెరిగినట్లు రేజర్ పే తెలిపింది.

మళ్లీ మాములు స్థితికి..

అన్ లాక్ 4తో సిటీ మాములు స్థితికి చేరుకుం టోంది. దాదాపు అన్ని యాక్టివిటీస్​ మొదలయ్యాయి. జనం కూడా పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. లాక్ డౌన్​లో ఆన్​లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడంతో అన్ లాక్​లో పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇటీవల రేజర్ పే సంస్థ ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్​లో సర్వే చేసింది. ఢిల్లీలో 72.4శాతం, హైదరాబాద్ లో 68.3శాతం, ముంబయిలో 58.5శాతం మంది పేమెంట్స్​కి క్యాష్​నే ప్రిఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. దాంతో ఏటీఎం సెంటర్లు,   క్యాష్ విత్ డ్రా పాయింట్స్ వద్ద రద్దీ పెరిగినట్లు తెలిపింది.

ఆర్డర్స్ డిలే అవుతుండటంతో..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్​కి కరోనా ఎఫెక్ట్​తో లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఈ -కామర్స్ సైట్స్ ద్వారా ఆర్డర్స్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతాయో కచ్చితంగా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆన్​లైన్​ డెలివరీ లేట్​అవడం, ప్రొడక్ట్స్ స్టాక్ లేకపోవడంతో ఈ -కామర్స్ పోర్టల్స్​పై ప్రీ పెయిడ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు సిటిజన్స్​ ఇంట్రెస్ట్ చూపించ లేదు. కస్టమర్లు డిజిటల్​గా పే చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్​ సెలెక్ట్ ​చేసుకున్నారు. క్యాష్ పేమెంట్స్ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ గా రేజర్ పే పేర్కొంది.

ప్రీపెయిడ్ ఆర్డర్స్ తగ్గినయ్

కరోనా కారణంగా సప్లయ్​ చైన్ దెబ్బతినడంతో ఈ -కామర్స్ పోర్టల్ పై ప్రీపెయిడ్ ఆర్డర్లు చేయడానికి కస్టమర్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదు. ఈ -కామర్స్ వాల్యూమ్స్ తగ్గడానికి ముఖ్య కారణం లాజిస్టికల్ ప్రాబ్లమ్స్. దాని వల్ల ఇన్​టైమ్​లో ప్రొడక్ట్ డెలివరీ అవుతుందో, లేదో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ మొదట్లో ప్రీపెయిడ్ ఆర్డర్స్ పెరిగినా, డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకుంటున్నారు.

‑ హర్షిల్ మాథుర్, రేజర్‌‌‌‌పే సీఈఓ

Latest Updates