జేఈఈ టాప్ టెన్​లో ఇద్దరు మనోళ్లు

టాప్ 20లో నలుగురికి చోటు

టాప్ 20లో నలుగురికి చోటు

రాష్ట్రం నుంచి జేఈఈ అడ్వాన్స్‌‌డ్​కు 22వేల మంది

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ (సెప్టెంబర్)లో వంద పర్సంటైల్​తో పాటు టాప్​ర్యాంకుల్లోనూ తెలంగాణ స్టూడెంట్లు హవా కొనసాగించారు. ఆలిండియా టాప్ టెన్​ర్యాంకుల్లో 7,8 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన శశాంక్ అనిరుధ్ జాతీయస్థాయి ఓపెన్ కేటగిరిలో 7వ ర్యాంక్ సాధించి, తెలంగాణ టాపర్​గా నిలిచాడు. ఓపెన్ కేటగిరిలో 8వ ర్యాంకు సాధించిన సాగి శివకృష్ణ రెండోస్థానంలో నిలిచాడు. ఆలిండియా టాప్ 20 లో నలుగురు చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్​జనవరి, సెప్టెంబర్​లో జరిగిన రెండు ఎగ్జామ్స్​కు11.74 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 10.23 లక్షల మంది హాజరయ్యారు. జనవరి, సెప్టెంబర్ లో జరిగిన రెండు పరీక్షలు 4.81 లక్షల మంది​రాశారు. తెలంగాణ నుంచి జేఈఈ మెయిన్(సెప్టెంబర్) పరీక్షకు 67,319 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నెల 27న జేఈఈ అడ్వాన్స్​డ్​ఎగ్జామ్ జరగనుంది. జేఈఈ మెయిన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా 2.5 లక్షల మందికి అడ్వాన్స్ డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి ఓసీ కేటగిరిలో 90.3765 పర్సంటైల్, ఈడబ్ల్యూఎస్​కోటాలో 70.2435, ఓబీసీ 72.8887, ఎస్సీ 50.1760, ఎస్టీ 39.0696, పీడబ్ల్యూడీ కోటాలో 0.0618 పర్సంటైల్ ను కటాఫ్​గా పెట్టారు. ఈ మన రాష్ట్రం నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​రాసేందుకు 20 వేల నుంచి 22 వేల మంది వరకూ సెలక్ట్ కావచ్చని చెప్తున్నారు. టాపర్లంతా ఐఐటీల్లో సీట్లే లక్ష్యంగా అడ్వాన్స్ డ్​ఎగ్జామ్​కు ప్రిపేర్ అవుతున్నట్టు పేర్కొంటున్నారు.

 

Latest Updates