కరోనాతో నాలుగేళ్ల చిన్నారి మృతి

కరోనా వైరస్ సోకిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది. శుక్రవారం ఉదయం కేరళలోని కోజికోడ్‌లోని ప్రభుత్వఆస్పత్రిలో చిన్నారి మరణించింది.

చిన్నారికి పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తాయి. అయితే  ఊపిరి ఆడకపోవడం అత్యవసర చికిత్స కోసం ఏప్రిల్ 17న మంజేరీలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి చిన్నారికి   జ్వరం,  శ్వాస తీసుకోవడం ఎక్కువ అవ్వడంతో పట్టణంలోని మరొక ఆసుపత్రిలో జాయిన్ చేయించారు ఆమె తల్లిదండ్రులు.

ఆ తరువాత ఏప్రిల్ 21 న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చిన్నారికి కరోనా టెస్ట్ చేయించామని రిజల్ట్ పాజిటీవ్ వచ్చినట్లు చెప్పారు. అయితే పాపకు కరోనా ఎలా సోకిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టామన్నారు.  విదేశాల నుండి తిరిగి వచ్చిన ఆమె బంధువులలో ఒకరికి కరోనా టెస్ట్ చేసినట్లు, ఆమెకు కరోనా సోకలేదని చెప్పిన వైద్యులు..అంతకు ముందుకు చిన్నారికి ట్రీట్ మెంట్ ఇచ్చిన డాక్టర్లు క్వారంటైన్ వెళ్లినట్లు  కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Latest Updates