మాస్క్ ​పెట్టుకోకుంటే హాస్పిటల్​లో పనిచేయాల్సిందే

గ్వాలియర్: మాస్క్​ మస్ట్​ అని చెప్పినా కొందరు లైట్ తీసుకుంటున్నారు. అటువంటి వాళ్లకు మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్ ​​పోలీసులు షాకిస్తున్నారు. మాస్క్​లేకుండా పబ్లిక్​ ప్లేస్​లో కన్పిస్తే హాస్పిటల్​లో వాలంటీర్​గా మూడు రోజులు పనిచేయాలంటూ రూల్​ పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే మధ్యప్రదేశ్​లోనూ  కరోనా కేసులు  పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కోవిడ్​ 19 రూల్స్​ను స్ట్రిక్ట్​​గా ఫాలో కావాలని  ప్రకటించింది. అయినా కొందరు ఈ రూల్స్​ పాటించడంలేదని గుర్తించిన అధికారులు.. మాస్క్​ పెట్టుకోకున్నా, కోవిడ్​ 19 రూల్స్​ పాటించకున్నా ఫైన్​తోపాటు ఏదైనా కోవిడ్​ హాస్పిటల్​లో లేదా పోలీస్​చెక్​ పోస్టుల దగ్గర మూడు రోజులు పనిచేయాలనే  రూల్​ పెట్టారు. కరోనా కట్టడి కోసం మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ‘కిల్​ కరోనా’ క్యాంపెయిన్​ నిర్వహిస్తోంది.

గల్వానా లోయ నుంచి చైనా సోల్జర్లు వెనక్కి

 

.

Latest Updates