కేరళ ఏనుగు హత్య కేసులో తొలి నిందితుడి అరెస్ట్

తిరువనంతపురం: కేరళలో గర్భిణీ ఏనుగు మృతికి కారకుడైన ఒకరిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను గుర్తించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించిన ఒక రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. అడవి పందుల నుంచి పంటలను కాపాడేందుకు పెట్టిన బెల్లం పూసిన నాటుబాంబును ఏనుగు తినడంతో చనిపోయి ఉండవచ్చునని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే, అరెస్టయిన వ్యక్తి ఇతరుల కోసం నాటు బాంబును స్వయంగా తయారు చేసి ఇచ్చాడని పాలక్కడ్ జిల్లా పోలీసు చీఫ్ తెలిపారు. ఈ కేసులో మరింతమంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. పాలక్కడ్ జిల్లాలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలోకి వెళ్లిన ఏనుగు పటాకులు నింపిన పండు తిని చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తించింది.

Latest Updates