చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా?: రాహుల్‌ గాంధీ

  • కేంద్రంపై మరోసారి విమర్శలు

న్యూఢిల్లీ: ఇండియా – చైనా మధ్య గొడవలు మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. చైనా మన భూభాగంలోకి వచ్చిందని, మన టెరిటరీని ఆక్రమించుకుందని రాహుల్‌ అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత ప్రతి రోజు ట్విట్టర్‌‌ ద్వారా ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తున్న రాహుల్‌ గాంధీ మంగళవారం మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు. “ మేమంతా చైనా దండయాత్రను ఎదుర్కొనేందుకు కలిసొస్తాం. చైనా మన భూ భాగాన్ని ఆక్రమించిందా?” అని ప్రశ్నిస్తూ లడాఖ్‌లో పొయిన నెల గొడవ జరిగిన ప్రాంతమైన పన్‌గాంగ్‌ టీఎస్‌వో చెరువు ఫొటోను రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. సోమవారం కూడా రాహుల్‌ గాంధీ మోడీపై విమర్శలు చేశారు. “ చైనా మన ఆర్మీని చంపేసింది. మన భూభాగాన్ని లాక్కుంది. ఇలాంటి టైంలో మోడీని ఎందుకు పొగుడుతుంది” అని అన్నారు. ప్రధాని మోడీని పొగుడుతూ చైనాకు చెందిన ఒక పత్రిక కథనం ప్రచురించడంతో రాహుల్‌ గాంధీ ఆ విమర్శలు చేశారు.

 

Latest Updates