అమెరికాకు ఈజిప్టు సాయం.. 2 లక్షల మాస్కులు పార్సిల్

48 వేల షూ కవర్లు, 20 వేల సర్జికల్ క్యాప్స్

వాషింగ్టన్: అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి ఈజిప్టు సాయం అందించింది. అమెరికాకు మెడికల్ ఎక్విప్​మెంట్లను బుధవారం మిలిటరీ కార్గో విమానంలో పార్సిల్ చేసింది. ఇప్పటికే ఇటలీ, చైనా దేశాలకు మెడికల్ ఎక్విప్ మెంట్లను అందించిన ఈజిప్టు.. అమెరికాకు 200,000 మాస్కులు, 48,000 షూ కవర్లు, 20,000 సర్జికల్ క్యాప్​లు, తదితర మెడికల్ సామాగ్రిని అందజేసింది. బుధవారం వాషింగ్టన్ శివారులో పార్శిల్ విమానం ల్యాండ్ అయిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. ‘‘ఈజిప్ట్ వంటి మిత్రదేశాలతో సంబంధాలు కొనసాగించడం సంక్షోభ సమయాల్లోనే కాదు, ప్రతిరోజూ అవసరం” అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కైరోలోని అమెరికా రాయబారి జొనాథన్ కోహెన్ కూడా ఈజిప్టు సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈజిప్టులోనూ కరోనా బాధితుల సంఖ్య 3,300 దాటిందని, 250 మంది చనిపోయారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.

Latest Updates