2 కిలోల ప్లాస్టిక్ కు కిలో ఉల్లిగడ్డ, టమాటా

  •  రసూలాబాద్​ పంచాయతీలో ప్లాస్టిక్​ నిషేధానికి తీర్మానం

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రసూలాబాద్ ను సర్పంచ్​పచ్చిమడ్ల స్వామి ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నిషేధ గ్రామంగా శుక్రవారం ప్రకటించారు. రెండు బట్ట సంచులను ప్రతి కుటుంబానికి అందజేశారు. గ్రామ పంచాయతీకి రెండు కిలోల ప్లాస్టిక్​ అప్పగిస్తే కిలో కూరగాయలు(ఉల్లిగడ్డ, టమాటా) ఇస్తామని తీర్మానం చేసి పలువురికి అందజేశారు. ఇక నుంచి మార్కెట్, కిరాణ సామగ్రికి​ వెళ్లినపుడు జీపీ అందించిన బట్ట సంచులను వాడాలని సూచించారు. ఎంపీపీ తలారి కీర్తన, ఎంపీడీఓ మల్లికార్జున్​ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates