11 మందికి ఐఏఎస్‌లుగా ప్రమోషన్

In Telangana 11 Members get Promoted as IAS officers : UPSC Chairman

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న 11 మంది ఆఫీసర్లకు కన్ ఫర్డ్ ఐఏఎస్ లుగా ప్రమోషన్లు లభించాయి. యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా నేతృత్వంలోని కమిటీ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా , రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ప్రమోషన్లు పొం దిన ఆఫీసర్లలో ఇప్పటికే ఏడుగురు జిల్లా కలెక్టర్లుగా పని చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలిన వారికి పోస్టింగ్స్ ఇచ్చే చాన్స్ ఉంది.

ప్రమోషన్లు పొందిన ఆఫీసర్లు

 • నారాయణ రెడ్డి (కలెక్టర్, ములుగు)
 • అయేషా మస్రత్ ఖానమ్ ( కలెక్టర్,వికారాబాద్)
 • వెంకట్రావ్ (కలెక్టర్, నా రాయణపేట)
 • సామలూరు హరీష్ (జేసీ, రంగారెడ్ డి )
 • గుగులోతు రవి ( జేసీ, హైదరాబాద్)
 • నిఖిల ( జాయింట్ కలెక్టర్, సంగారెడ్ డి)
 • స్వర్ణలత (జాయింట్ కలెక్టర్, భూపాలపల్లి)
 • షేక్ యాస్మీన్ భాషా ( జేసీ, సిరిసిల్ల)
 • సత్య శారదాదేవి ( సీసీఎల్ఏ, సహాయ కార్యదర్శి)
 • సంగీత (సీసీఎల్ఏ, సహాయ కార్యదర్శి )
 • కందుల స్నే హ (డిప్యూటీ డైరెక్టర్, కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ)

Latest Updates