రామయ్యకు జ్యేష్ఠాభిషేకం

భద్రాచలం, వెలుగు: జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామికి జ్యేష్ఠాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు లేకుండానే ఈ వేడుక నిర్వహించారు. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ చేశారు. బాలభోగం సమర్పించారు. మూలవరులకు అభిషేకం చేశారు. అనంతరం సమస్త నదీ, సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి పలు రకాల హారతులతో ఆరాధన జరిగింది. మధ్యాహ్నం స్వామికి రాజభోగం నివేదించారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా స్వామి నిత్యకల్యాణాన్ని రద్దు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

Latest Updates