బోర్డు నిర్లక్ష్యమే కొంపముంచిందా!

భారీ అంచనాలున్న రోహిత్​ శర్మ ఆస్ట్రేలియా సిరీస్​కు అందుబాటులోకి రాకుంటే ఇండియాకు ఎదురుదెబ్బే కానుంది. తొలి టెస్టు తర్వాత కోహ్లీ సిరీస్​కు దూరం అవుతున్న నేపథ్యంలో హిట్​మ్యాన్​ కీలకం అవుతారని అంతా ఆశించారు. కానీ, అతను ఆసీస్​ విమానం ఎక్కడమే ప్రశ్నార్థకంగా మారడం శోచనీయం. రోహిత్‌‌ గాయం చుట్టూ ఉన్న అంశాలను పరిశీలిస్తే  పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలకు, బీసీసీఐ మధ్య ఉన్న కమ్యూనికేషన్‌‌ గ్యాప్‌‌ స్పష్టమతోంది.  ఐపీఎల్‌‌ 13 లీగ్‌‌ స్టేజ్‌‌  సందర్భంగా  రోహిత్‌‌ హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీకి గురయ్యాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. ఈ లోపు ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమ్‌‌ను అనౌన్స్‌‌ చేసిన సెలెక్టర్లు రోహిత్‌‌ను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో రోహిత్‌‌ ఐపీఎల్‌‌ జర్నీ కూడా ముగిసిందని అంతా భావించారు. కానీ సెలెక్షన్‌‌ జరిగిన రోజునే ట్రెయినింగ్‌‌ రీస్టార్ట్‌‌ చేసిన రోహిత్‌‌.. చివరి మూడు మ్యాచ్‌‌ల్లో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  దీంతో వెంటనే రివైజ్డ్‌‌ టీమ్‌‌ ప్రకటించిన సెలెక్టర్లు టెస్ట్‌‌ సిరీస్‌‌కు రోహిత్‌‌ను ఎంపిక చేశారు. లీగ్‌‌ పూర్తయ్యాక రిహాబిలిటేషన్‌‌ కోసం ఎన్‌‌సీఏకి రప్పించారు. కానీ రోహిత్‌‌ గాయపడిన రోజు తర్వాత హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి, బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ కీలక కామెంట్స్‌‌ చేశారు. రీఎంట్రీకి తొందరపడితే రోహిత్‌‌  కెరీర్‌‌కే ముప్పు అని అభిప్రాయపడ్డారు. దీని బట్టి ముంబైకర్‌‌కు అయిన గాయం తీవ్రత బోర్డుకు క్లియర్‌‌గా తెలుసు. అయినా రోహిత్‌‌ బరిలోకి దిగాడంటే.. బీసీసీఐకి,ముంబై ఇండియన్స్‌‌ మధ్య కమ్యూనికేషన్‌‌ గ్యాప్‌‌ అర్థమవుతోంది. అంతేకాక ఇషాంత్‌‌ మాదిరిగా రోహిత్‌‌ను  లీగ్‌‌ నుంచి  ఎందుకు తప్పించలేదని ప్రశ్న తలెత్తుతోంది. దీంతో  ఇటు బోర్డు, అటు ప్లేయర్లు.. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ కంటే ఐపీఎల్‌‌కే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు రోహిత్‌‌ విషయంలోనే  కాదు.. 2018లో భువనేశ్వర్‌‌ కుమార్‌‌ విషయంలోనూ బీసీసీఐ ఇలానే వ్యవహరించింది.  ఆ  సీజన్‌‌ ఐపీఎల్‌‌లో భువీ లోయర్‌‌ బ్యాక్‌‌ ఇంజ్యురీతో బాధపడ్డాడు. కానీ, అతని వర్క్‌‌లోడ్‌‌ విషయంలో బోర్డు నుంచి సన్‌‌రైజర్స్‌‌ ఫ్రాంచైజీకి ఎలాంటి సమాచారం రాలేదు. దాంతో కీలక ఇంగ్లండ్‌‌ టూర్‌‌ను భువీ మిస్సయ్యాడు. అలాగే, రెండు గాయాలతో బాధపడుతున్న  వృద్ధిమాన్‌‌ సాహాను టీమ్‌‌తో పాటు ఆసీస్‌‌ తీసుకెళ్లిన మేనేజ్‌‌మెంట్‌‌ రోహిత్‌‌, ఇషాంత్‌‌ను కూడా తీసుకెళ్తే  వాళ్లు కూడా అక్కడే రిహాబిలిటేషన్‌‌లో పాల్గొంటూ ఫిట్‌‌నెస్‌‌ పెంచుకునే ప్రయత్నం చేసుకునేవారు. కానీ, బోర్డు ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కావడం లేదు.  మరోపక్క డబ్బు కోసం రోహిత్‌‌ తన కెరీర్‌‌ను పణంగా పెట్టాడనే  విమర్శలు కూడా ఉన్నాయి. కోచ్‌‌ రవిశాస్త్రి, బీసీసీఐ బాస్‌‌ గంగూలీతోపాటు పలువురు సీనియర్లు గాయం విషయంలో చేసిన సూచనలను తన ఫ్రాంచైజీ కోసం అతను పెడచెవిన పెట్టాడని అంటున్నారు. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ విషయంలో ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా బోర్డుల మాదిరిగా బీసీసీఐ కఠినంగా ఉండుంటే రోహిత్‌‌ ఇలా చేసే వాడు కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates