ప్రజల పైసలతో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నడు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ప్రజల పైసలతో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నారన్నారు. మంగళవారం ఆయన పఠాన్ చెరు, అంబెద్కర్ కాలనీ డివిషన్ లో ప్రచారం చేశారు. నదీశ్వర్ గౌడ్ మంచి సేవలు అందించారని.. ఇప్పుడు ఆయన కుమారుడు ఆశిష్ గౌడ్ తండ్రి దారిలోనే సేవలు అందిస్తారన్నారు. ఆశిష్ గౌడ్ ఇప్పటికే అంబెడ్కర్ డివిషన్ లో చాలా సేవా కార్యక్రమాలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేసి ఆశిష్ గౌడ్ ను గెలిపించాలన్నారు.

కేసీఆర్.. కొడుకు, కుతురు, అల్లుడికి ఫామ్ హౌస్ లకు ఒక్కోటి ఉన్నాయని.. ఆ సొమ్మంతా ఎవరిదని ప్రశ్నించారు. 67 వేల కోట్లరూపాయల పైసలు ఎటు వెళ్లాయని తాను నిలదీశానని..దగుల్బాజీ కేసీఆర్ మన ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల పైసలు దోచుకుని 2 వందల ఎకరాలు గచ్చిబౌలిలో కొన్నాడని..నిజామాబాద్ ప్రజలు ఓడించిన కూతురికి ఎంఎల్సీ ఇచ్చిండన్నారు. కరోనా కష్టకాలంలో సోయిలేక కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడన్నారు. ఆ తర్వాత  ఖైరతాబాద్ 91వ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధురితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివేక్.  ఈ కార్యక్రమంలో  బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates