హ్యాపీనెస్​ ఇండెక్స్​: టాప్ -10లో ఇండియా

న్యూఢిల్లీ: సంతోషంగా ఉండాలంటే ఒంట్లో ఆరోగ్యం, జేబులో బాగా డబ్బులుండాలి.. అంతేకదా! సంతోషకరమైన జీవితానికి ఈ రెండూ తప్పనిసరని ఇండియన్ల అభిప్రాయమని ఇప్సోస్ ​సర్వే ఒకటి తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలలో సర్వే జరిపి హ్యాపినెస్​ ఇండెక్స్​ను ప్రకటించింది. ఇందులో మన దేశం 9వ స్థానంలో నిలిచింది. సంతోషం విషయానికి వస్తే మన ఆలోచనలు వీటి చుట్టే తిరుగుతుంటాయని, పర్సనల్​ సేఫ్టీ, సెక్యూరిటీ, దోస్తులు కూడా ముఖ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట.

ఇంకా.. నివసించే వాతావరణం కంఫర్టబుల్​గా ఉండాలని, జీవితానికో అర్థం ఉండాలని, హాబీలు, ఇష్టాయిష్టాల సంగతీ పట్టించుకోవాల్సిందేనని ఇప్సోస్​ ఇండియా ఉన్నతాధికారి పారిజాత చక్రవర్తి చెప్పారు. ఇక ఈ సర్వే లిస్ట్​లో హ్యాపీయెస్ట్​ కంట్రీ  స్థానానికి ఆస్ట్రేలియా, కెనడా పోటీ పడుతున్నాయట.. తర్వాత వరుసగా చైనా, గ్రేట్​బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, సౌదీ అరేబియా, జర్మనీ, ఇండియా నిలిచాయని ఇప్సోస్ వెల్లడించింది.

Latest Updates