పిట్టల లైఫ్ జర్నీ..

గూడు కట్టిన నాటి నుంచి గుడ్లు పెట్టి, అవి పొదిగే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడాడు. కెమెరా కన్నుతోనూ భద్రంగా దాచాడు. ఆయన పేరు ప్రతాప్ నాయక్. కాగజ్ నగర్ డివిజన్, సిర్పూర్ రేంజ్ పరిధిలోని డిప్యూటీ రేంజర్. నెల రోజుల నుంచి రెడ్ వెంటెడ్ బుల్ బుల్ (తోక కింద ఎరుపు ఉండే పిట్ట)ని పెంచుతున్నాడు. గూడు కట్టడం, అది గుడ్లు పెట్టడం, గుడ్డు పొదిగి, పగిలి పిల్లలు బయటకు రావడం, తల్లి పిట్ట, తండ్రి పిట్టలు వాటిని రక్షించడం.. ఇలా పిట్టకు రెక్కలొచ్చి ఎగిరేవరకు అన్ని దశల్లో ఫొటోలు తీశాడు. ఈ మొత్తం ప్రాసెస్ కి 28 రోజులు పట్టింది.  -కాగజ్ నగర్, వెలుగు

Latest Updates