ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఆర్ధికంగా నష్టపోయాయి. దీంతో ఆయా రంగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు భారీ ఎత్తున శాలరీలు పెంచుతూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాయి.

కరోనా వల్ల మోటార్ వెహికల్ రంగం భారీ ఎత్తున నష్టాల్ని చవి చూస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు పలు కార్ల కంపెనీలు కస్టమర్‌లకు తక్కువ ఈఎంఐలతో లోన్​ అందించేందుకు పలు బ్యాక్ లతో టై అప్ అవుతున్నాయి. దీనిలో భాగంగా కొత్తగా మారుతీ కార్లు కొనే వారికి హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ లో ఈఎంఐని ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఈ స్కీమ్‌‌‌‌ ప్రకారం మారుతి కస్టమర్లు ప్రతి ఏడాది మూడు నెలల పాటు లో ఈఎంఐని చెల్లిస్తే సరిపోతుంది. దీంతోపాటు కస్టమర్లు ప్రతి రూ. లక్ష అప్పుపై కేవలం రూ. 899 లను ఈఎంఐగా చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను మొదటి ఆరు నెలల వరకు హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ అందిస్తుంది.

యూకే లో ఫియట్, అల్ఫా రోమియో కంపెనీలు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించినట్లు డైలీ మెయిల్ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. కారు కొన్న 12నెలల లోపు ఉద్యోగ కోల్పోతే  మొదటి ఏడు నెలల పాటు ఆ కారు కొన్న వ్యక్తి ఈఎంఐలను మాఫీ చేసేస్తాయి. ఇది ఆరంభం మాత్రమేనని, ఇలాంటి ఆఫర్లను మిగిలిన కంపెనీలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని డైలీ మెయిల్ తెలిపింది.