ఒక్క రోజే 372 లైసెన్సులు రద్దు

కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చాక వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసులు పెట్టడమే గాకుండా లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ఏపీలోని విజయవాడలో ఒక్కరోజే 372 లైసెన్సులు రద్దు చేశారు ట్రాఫిక్ పోలీసులు.

హెల్మెట్ పెట్టుకోని ద్విచక్ర వాహనదారులపై చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో గురువారం ఒక్కరోజే 372 కేసులు నమోదు చేసి..వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామన్నారు డిటిసి వెంకటేశ్వరరావు. తనిఖీల కోసం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సెంట్రల్ మోటార్ వాహన చట్టం 138 (F) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు

Latest Updates