వ్యవసాయ భూముల్లో ఇండ్లు కట్టుకుంటే రికార్డుల్లో చేర్చండి-అధికారులకు కేసీఆర్ ఆదేశం

ఏనగల్లు పంచాయతీ సెక్రటరీతో ఫోన్‌ లో మాట్లాడిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌‌, వెలుగువ్యవసాయ భూముల్లో ఇండ్లు కట్టుకుంటే ల్యాండ్‌‌ కన్వర్షన్‌‌ చేయించి రికార్డుల్లో చేర్చాలని అధికారులను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌‌లో ఎకరంన్నర భూమిని కన్వర్ట్‌‌ చేయించుకొని ఇల్లు కట్టుకున్నానని, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ అదే మాదిరిగా చేయాలని సూచించారు. వరంగల్‌‌ రూరల్‌‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనగల్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ రమాదేవితో సీఎం శనివారం ఫోన్‌‌లో మాట్లాడారు. పంచాయతీల్లో ఇండ్ల రికార్డులు, మ్యుటేషన్లు, ట్యాక్స్‌‌ వసూళ్ల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.

సీఎం ప్రశ్న.. పంచాయతీ సెక్రటరీ జవాబు..

సీఎం: గ్రామ పంచాయతీలో ఒక ఇంటిని ఒకరి నుంచి మరొకరు కొంటే కొన్న వ్యక్తి మీద రికార్డును ఎవరు మారుస్తారు?

రమాదేవి: దానికి పంచాయతీ సెక్రటరీనే అథారిటీ సర్. ఏనుగల్లులో 922 ఇండ్లు ఉన్నాయి. రికార్డుల్లో లేని ఇండ్లు ఇంకో 50 వరకు ఉంటాయి. (అవి కూడా రికార్డుల్లోకి చేర్చాలని సీఎం ఆదేశించారు.)

సీఎం: ఆస్తి మార్పిడి జరిగినా, తండ్రి ఆస్తిని ఇద్దరు కొడుకులు పంచుకున్నా, ఒకాయనకు ఇల్లు వచ్చి ఇంకొకాయన వెల్లిపోయిండు అనుకుంటే ఆ ఒక్కాయన పేరుమీద మార్చేది మనమే కదా.. దానికి రెవెన్యూ కానీ సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ గానీ సంబంధం లేదు కదా

రమాదేవి: తన కొడుకులకు భూమిని పంచి ఇస్తున్నట్టు వాళ్ల తండ్రి పేపర్‌‌ తీసుకువచ్చి ఇస్తే దాని ద్వారా ఆన్‌‌లైన్‌‌లో సపరేట్‌‌ చేసి నంబర్‌‌ ఇచ్చేస్తం సర్.

సీఎం: ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామకంఠం భూముల రికార్డు ఉంటుందా?

రమాదేవి: ఉంటుంది సర్.

రమాదేవి: సొంత వ్యవసాయ భూముల్లో ఇండ్లు కట్టుకున్నవాళ్లు నా దగ్గరికి వచ్చి రికార్డు చేయమంటే మనం చేయలేం గదా సార్‌‌.. అది ఎట్లా చేయాలే..?

సీఎం: మందిది గాదు నా ఫాంహౌస్ ఉంది.. నా కొడుకుది నాది కలిసి వందెకరాలు ఉంటది. దాంట్ల మొన్ననే నేను ఇల్లు కట్టుకున్న. నేను ముఖ్యమంత్రి కదా.. నేను ఇల్లీగల్‌‌ కట్టుకోవద్దు కదా.. చట్టప్రకారం కట్టుకోవాలంటే ఏం చేయాల్నని అడిగిన.. ‘గింత ఫీజు కడితే నాన్‌‌ అగ్రికల్చర్‌‌గా కన్వర్ట్‌‌ చేస్తం’ అని చెప్పిండ్రు. నా ఇల్లు కరెక్ట్‌‌ ఎకరంన్నరల కాంపౌండ్‌‌ వాల్‌‌, ఇల్లు ఉంది.. ఆ ఎకరంన్నర ఫీజు కడితే కన్వర్ట్‌‌ చేసిండ్రు.. డీపీవో నాకు పర్మిషన్‌‌ ఇచ్చిండు.. నేను కట్టిన ఫీజు గ్రామ పంచాయతీకి ట్రాన్స్‌‌ ఫర్‌‌ అయ్యింది. నా ఇల్లు గ్రామ పంచాయతీ దాంట్లకి వచ్చింది. మీ ఎగనల్లు గ్రామ పంచాయతీ జ్యూరిస్‌‌డిక్షన్‌‌ల ఎక్కడ ఎవ్వడు ఇల్లు గట్టిన దాన్ని మీ పరిధిలకు తీసుకోవాలే. దానికి ఎంతైనా గాని వాళ్లు ట్యాక్స్‌‌ కూడా పే చేయాలే.. ఇది చట్టం.. ఇప్పుడు నా ఇల్లు గ్రామంలకి వచ్చింది కాబట్టి ట్యాక్స్‌‌ కూడా రెగ్యులర్‌‌గా పే చెయ్యాలే. మీ దగ్గర అట్లుంటే కన్వర్ట్‌‌ చేసుకోమని చెప్పండి.. చేసుకుంటేనే వాళ్లకు రక్షణ ఉంటది..

సీఎం: మ్యూటేషన్‌‌ మీరే చేస్తరు.. రికార్డు మీ దగ్గర్నే ఉంటది.. దాన్ని బట్టే మీరు హౌస్‌‌ ట్యాక్స్‌‌ కలెక్ట్‌‌ చేస్తరు.. ఇది ఎమ్మార్వో దగ్గర ఉండదు.. ఇది అంతా ఆన్‌‌లైన్‌‌ అయింది కదా.. అన్ని గ్రామాల్లో ఉంది.. కదా

రమాదేవి: లాస్ట్‌‌ ఇయర్‌‌ నుంచి అన్ని గ్రామాల రికార్డులు ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌డేట్‌‌ అవుతున్నయ్‌‌ సర్.

 

Latest Updates