అర్ధరాత్రి వరకు ఆస్తి పన్ను స్వీకరణ

హైదరాబాద్‌ , వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం ఆస్తిప న్ను చెల్లించడానికి వీలుగా నేడు జీహెచ్ఎంసీలోని అన్ని సిటీజన్ సర్వీస్ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయ ని జీహెచ్ఎంసీ క మిష న ర్ ఎం.దానకిశోర్‌‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లించడానికి 31వ తేదీతో  గడువు ముగుస్తుందని, జనవరి 1వ తేదీ నుంచి ఆస్తి పన్ను బకాయిలపై రెండు శాతం జరిమానా విధిస్తామని కమిషనర్ తెలిపారు. ఆస్తిపన్ను చెల్లించేందుకు ఆదివారం సిటీజన్ స ర్వీస్ సెంటర్లన్నీ రాత్రి 12గంటల వరకు పని చేస్తాయని, ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకుని ఆస్తిప న్ను చెల్లించాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు.

సిటీజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీ-సేవా కేంద్రాల్లో,  ఆన్‌ లైన్ ద్వారా కూడా తమ ఆస్తి పన్ను ను చెల్లించ వచ్చని  సూచించారు. ఇప్పటివర కు ఆస్తిపన్ను చెల్లించని 4,11,578 మంది సెల్‌ ఫోన్‌ లకు ఎస్‌ ఎంఎస్‌ పంపించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను లక్ష్యం రూ. 1500 కోట్లుగా నిర్ణయించ గా.. శ నివారం సాయంత్రం వ రకు రూ. 1240.35 కోట్లు వసూలయ్యాయి. లక్ష్యం  మేరకు ఆదివారం ఒక్కరోజు రూ.259 కోట్లు సేకరిం చాల్సి ఉంది.

Latest Updates