బెడ్స్, వెంటిలేటర్స్ సంఖ్య పెంచండి

కేంద్రం, ఆప్ సర్కార్‌‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నందున ఢిల్లీలో హాస్పిటల్ బెడ్స్, వెంటిలేటర్ల సంఖ్యను పెంచాలని కేంద్రం, ఆప్ సర్కార్‌‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు ఢిల్లీలో 9,179 బెడ్స్ ఉన్నాయని, వాటిలో 4,914 బెడ్స్‌లో పేషెంట్లు ఉండగా మిగిలినవి అందుబాటులో ఉన్నాయని ఆప్‌ సర్కార్ ఈనెల 9వ తేదీన ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మొత్తం 569 వెంటిలేటర్లు ఉన్నాయని, వాటిలో 315 వెంటిలేటర్లను ట్రీట్​మెంట్​ తీసుకునే వారు వినియోగిస్తున్నారని, మిగతావి అందుబాటులో ఉన్నాయని కూడా హైకోర్టుకు ఢిల్లీ గవర్నమెంట్ చెప్పింది. ఈ అంశం పై విచారణ జరిపిన చీఫ్​జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్‌తో కూడిన బెంచ్, వెంటనే బెడ్స్, వెంటిలేటర్స్ సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, ఢిల్లీ సర్కార్‌‌ను ఆదేశించింది. సౌత్ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీతో సహా కంటెయిన్‌మెంట్ ఏరియాల్లో గైడ్‌లైన్స్, ఢిల్లీలోని హాస్పిటల్స్‌లో కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేసేందుకు ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయో స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కొంతమంది లాయర్లు, అడ్వకేట్ మృదుల్ చక్రవర్తి జాయింట్‌గా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించి తీర్పునిచ్చింది.

Increase number of beds, ventilators for Covid-19 patients, HC tells Centre, AAP govt

Latest Updates