మాకు ట్యాక్సులు పెంచండి

మేమేం ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ వారియర్స్‌‌‌‌గా పని చేయట్లే
మా పైసలు వాడుకోవచ్చు

లండన్‌‌‌‌: మనీ కన్నా మానవత్వం ముఖ్యమంటుంటారు. అది నిజం చేస్తూ ఓ 80 మంది సంపన్నులు కొవిడ్‌‌‌‌పై పోరుకు డబ్బుల కోసం తమ లాంటి ఉన్నోళ్లపై సరైనంత ట్యాక్స్‌‌‌‌ వేయమని ప్రభుత్వాలను కోరారు. అమెరికా, బ్రిటన్‌‌‌‌లలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వీళ్లు సోమవారం అక్కడి ప్రభుత్వాలకు బహిరంగ లెటర్‌‌‌‌ రాశారు. లెటర్‌‌‌‌పై సంతకం చేసిన వాళ్లలో అభిగల్‌‌‌‌ డిస్నీ, టిమ్‌‌‌‌ డిస్నీ, మ్యారీ ఫోర్డ్‌‌‌‌ ఉన్నారు.

మనమంతా సాయం చేయాలి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ లాంటి కుబేరులపై శాశ్వత ప్రాతిపదికన ట్యాక్స్‌‌‌‌ వేయాలని.. ఆ డబ్బును హెల్త్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌, స్కూళ్లు, సెక్యూరిటీ కోసం వాడాలని కోరారు. ‘ఇంటెన్సివ్‌‌‌‌ కేర్‌‌‌‌ యూనిట్లలో ఉంటున్న పేషెంట్లకు మేము ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయట్లేదు. రోగులను హాస్పిటళ్లకు అంబులెన్స్‌‌‌‌లలో తీసుకెళ్లట్లేదు. ఇంటింటికీ తిరిగి తిండి పెట్టట్లేదు. కానీ మా దగ్గర డబ్బుంది. చాలా ఉంది. ఇప్పడు దీని అవసరం ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు మా లాంటి డబ్బున్నోళ్లపై ట్యాక్స్‌‌‌‌ వేయాలి’ అని కోరారు. కొవిడ్‌‌‌‌-19 ప్రపంచాన్ని వణికిస్తున్నందున తమ వంటి సంపన్నులు ప్రపంచం కోలుకునేందుకు సాయం చేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారు.

ఇంకో చాన్స్‌‌‌‌ రాదు
‘ప్రపంచంపై కొవిడ్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌ దశాబ్దాల పాటు ఉంటుంది. 50 కోట్ల మందిని పేదరికంలోకి తోసేసే ప్రమాదం ఉంది. వందలు, వేలల్లో జనం జాబ్‌‌‌‌లు కోల్పోవచ్చు. కొందరి బిజినెస్‌‌‌‌లు పర్మనెంట్‌‌‌‌గా ఆగిపోవచ్చు. ఇప్పటికే 100 కోట్ల మంది వరకు పిల్లలకు వెళ్లడానికి స్కూళ్లు, వసతులు లేవు. హాస్పిటళ్లలో బెడ్స్‌‌‌‌ లేవు. ప్రొటెక్టివ్‌‌‌‌ మాస్కుల్లేవు. వెంటిలేటర్స్‌‌‌‌ లేవు. ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌‌‌‌పై సరైన విధంగా ఖర్చు చేయడం లేదు’ అని పేర్కొన్నారు. ముందు వరుసలో ఉండి కొవిడ్‌‌‌‌పై పోరాడుతున్న ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ వారియర్స్‌‌‌‌కు మనం రుణపడి ఉన్నామని, అయితే అలాంటి ముఖ్యమైన పని చేస్తున్న వాళ్లకు సరైన జీతం ఇవ్వట్లేదని అన్నారు. ఆలస్యం కాకముందే మేల్కొనాల్సిన అవసరం ఉందని, కరెక్టు చేసుకోవడానికి ఇంకో చాన్స్‌‌‌‌ రాదని అన్నారు.

For More News..

ట్రిపుల్ ఐటీ సీట్లలో కోత

జూన్ 30న కేబినెట్ మీటింగ్ జరిగిందా?

Latest Updates