ఐపీఎస్ ల వ‌యోప‌రిమితి పెంచాలి

హైద‌రాబాద్: ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని వెంటనే పెంచాలన్నారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. మంగ‌ళ‌వారం నలుగురు ఐపీఎస్ అధికారులు రిటైర్డ్ అయ్యారని..అందులో ప్రభాకర్ రావు ఐపీఎస్ ను మాత్రమే 3 సంవత్సరాలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మిగతా ముగ్గురు ఐపీఎస్ లను కూడా మూడు సంవత్సరాలు వారి పదవి కాలం కేసీఆర్ పొడిగించాలన్నారు.

వారు కూడా 30 సంవత్సరాల నుండి వారి సర్వీస్ సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన దగ్గరి నుండి చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని.. ఉద్యోగులకు ఇచ్చిన వయో పరిమితిని పెంచి 18 నెలల నుండి పదవి విరమణ చేసిన వారిని కూడా తిరిగి తీసుకోవాలన్నారు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

Latest Updates