పెరిగిన ఆంధ్రా బ్యాంకు వడ్డీ ఆదాయం

ఆంధ్రా బ్యాంకు వడ్డీ ఆదాయం మార్చి 2019తో ముగిసిన త్రైమాసికంలో 5.36 శాతం పెరిగి రూ. 4,853 కోట్లకు చేరింది. ఆంధ్రా బ్యాంకు వ్యాపారం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 6.95 శాతం పెరిగింది. రుణాలు మార్చి 2019తో ముగిసిన ఏడాది కాలానికి 8.60 శాతం, రిటైల్‌‌ పోర్ట్‌‌ఫోలియో 9.72 శాతం పెరిగాయని ఆంధ్రా బ్యాంకు తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌‌ కూడా 3.31శాతానికి పెరగ్గా, నికర ఎన్‌‌పీఏలు మాత్రం అంతకు ముందు ఏడాదిలోని 8.48 శాతం నుంచి 5.73 శాతానికి తగ్గాయని పేర్కొంది. బ్యాంకు మొత్తం డిపాజిట్లు రూ. 2,19,821 కోట్లకు  చేరగా, మొత్తం రుణాలు 1,78,690 కోట్లకు పెరిగాయి.

Latest Updates