బంగారానికి పెళ్లి కళ..పెరిగిన గిరాకీ

ఓ వైపు పెళ్లిళ్ల సీజన్.. మరోవైపు దిగొస్తోన్న ధరలు బంగారాన్ని భలే మెరిపించాయి. 2019 క్యూ1(జనవరి నుంచి మార్చి కాలం)లో ఇండియా గోల్డ్ డిమాండ్ 5 శాతం పెరిగి 159 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా గతేడాది కంటే ఇది 13 శాతం పెరిగి రూ.47,010 కోట్లకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 151.5 టన్నులుగా ఉన్నట్టు తెలిపింది. ఇండియాలో జువెల్లరీ డిమాండ్ కూడా 5 శాతం పెరిగి 125.4 టన్నులకు ఎగిసిందని, గోల్డ్ బార్స్, కాయిన్లలో పెట్టే ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు కూడా డిమాండ్ 4 శాతం పెరిగి  33.6 టన్నులకు చేరుకుందని 2019 క్యూ1 గోల్డ్ ట్రెండ్స్ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. క్యూ2లో కూడా ఈ డిమాండ్ బాగా పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనావేస్తోంది. మే 7న అక్షయ్ తృతీయ పండుగ, పెళ్లిళ్ల సీజన్, గతేడాది కంటే ఈ ఏడాది పంటలకు ధరలు ఎక్కువగా పలుకనుండటంతో డిమాండ్‌‌‌‌‌‌‌‌కు మరింత బూస్టప్ వస్తుందని పేర్కొంటోంది. అంతేకాక ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ఐఎండీ అంచనావేసిందని, అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడి బంగారానికి మరింత సహకరిస్తుందని పేర్కొంది. మొత్తంగా 2019లో గోల్డ్ డిమాండ్ 750 టన్నుల నుంచి 850 టన్నులకు పెరిగే అవకాశాలున్నాయని అంచనావేస్తోంది.  ఫిబ్రవరిలో పది గ్రాముల బంగారం ధర రూ.33,730ను తాకి, మార్చి తొలి వారం నాటికి రూ.32 వేలకు పడిపోయింది. ఈ తగ్గింపును వినియోగదారులు బాగా అందిపుచ్చుకున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్, డిజైనర్ బ్రాండ్స్, వెకేషన్స్ వంటి వాటి నుంచి కూడా గోల్డ్ జువెల్లరీకి బాగా డిమాండ్ వస్తోంది. వారు కన్జ్యూమర్లను ఆకట్టుకోవడానికి ప్రమోషనల్ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ ఆఫర్ చేస్తున్నారు. వీటిలో జువెల్లరీ మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు వంటివి ఉంటున్నాయి. కొంతమంది రిటైలర్లు యువతను టార్గెట్‌‌‌‌‌‌‌‌గా చేసుకుని లో క్యారెట్(14సీ)ను ప్రమోట్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారానికి బాగా గిరాకీ పెరిగింది. 2019 తొలి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 7 శాతం ఎగిసి, 1,053.3 టన్నులుగా నమోదైనట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఈ డిమాండ్ పెరగడానికి కారణం సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు బంగారం కొనుగోళ్లు బాగా చేపట్టడం, గోల్డ్ ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లు)లలో వృద్ధే అని చెప్పింది. 2018 క్యూ1లో ఈ డిమాండ్ 984.2 టన్నులుగా మాత్రమే ఉండేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ క్యూ1 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టులో వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు కొనుగోలు చేసిన బంగారం కొనుగోళ్లు కూడా  ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 68 శాతం పెరిగి 145.5 టన్నులకు చేరుకున్నాయి. 2013 నుంచి చూస్తే ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన కొనుగోళ్లే అత్యధికం. వీటిలో ఎక్కువగా రష్యా సెంట్రల్ బ్యాంక్ కొంది. రష్యా తర్వాత చైనా 33 టన్నుల కొనుగోళ్లు చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 8.4 టన్నుల బంగారం కొనుగోళ్లు చేపట్టిందని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ చెప్పారు.

‘2019 మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు వారి గోల్డ్ కొనుగోళ్లను పెంచడం కొనసాగించారు.  2018 తొలి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లు కూడా పెరిగాయి’ అని డబ్ల్యూజీసీ మార్కెట్ ఇంటెలిజెన్స్ హెడ్ అలిస్టైర్ హెవిట్ అన్నారు. మొత్తంగా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ డిమాండ్ 3 శాతం వరకు పెరిగిందని చెప్పారు. 2018లో 288.4 టన్నుల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ డిమాండ్ ఉంటే, 2019 క్యూ1 నాటికి ఇది 298.1 టన్నులకు చేరుకుందని తెలిపారు. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌లు, సంబంధిత ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు జనవరి–మార్చి కాలంలో 40.3 టన్నుల అదనంగా చేర్చుకున్నాయి. అంటే గతేడాది కంటే ఇవి 49 శాతం వరకు ఎక్కువ. యూరప్‌‌‌‌‌‌‌‌లో భౌగోళిక ఆందోళనలు పెరగడం, అమెరికా ఎకానమీ వృద్ధిపై అనుమానాలు వ్యక్తం కావడం బంగారం డిమాండ్‌‌‌‌‌‌‌‌ను బలపడేలా చేశాయి. గోల్డ్ బార్స్ డిమాండ్ తగ్గడంతో బార్, కాయిన్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ స్వల్పంగా 1 శాతం తగ్గి 257.8 టన్నులకు చేరుకుంది.  అధికారికంగా గోల్డ్ కాయిన్ కొనుగోళ్లు 12 శాతం పెరిగి 56.1 టన్నులుగా ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ సహకరించడంతో, గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా జువెల్లరీ డిమాండ్ 530.3 టన్నులకు చేరుకున్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది. గతేడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 527.3 టన్నులుగా ఉండేది. అయితే టెక్నాలజీ పరంగా వాడే గోల్డ్ వాల్యుమ్ రెండేళ్ల కనిష్టానికి చేరుకుని 79.3 టన్నులుగా ఉంది.

తగ్గిన గోల్డ్ ధరలు..

న్యూఢిల్లీ : గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు జువెల్లర్స్ నుంచి బలహీనమైన డిమాండ్ నమోదు కావడంతో గురువారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర బులియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ.250 తగ్గి రూ.32,620గా నమోదైందని బులియన్​ అసోసియేషన్ చెప్పింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా కేజీకి రూ.825 తగ్గి రూ. 37,700గా ఉంది.

పుత్తడిపై సంపన్నుల మోజు పెరుగుతోంది..

హైదరాబాద్‌‌, వెలుగు : ఇండియాలోని అల్ట్రా హై నెట్‌‌వర్త్‌‌ ఇండివడ్యువల్స్‌‌ (అత్యంత సంపన్నులు) ఈ ఏడాది బంగారంలో 3 శాతం పెట్టుబడులు పెంచనున్నారు. కిందటేడాది ఈ సంపన్నులు బంగారం మీద 11 శాతం పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో ఆసియాలోని సంపన్నులు కూడా బంగారంలో పెట్టుబడులను పెంచాలనుకుంటున్నట్లు నైట్‌‌ అండ్‌‌ ఫ్రాంక్‌‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇండియాలోని అత్యంత సంపన్నులు తమ మొత్తం పెట్టుబడులలో నాలుగు శాతాన్ని సాధారణంగా బంగారంలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ విషయంలో  ప్రపంచ సగటు 2 శాతమే కావడం గమనార్హం.  బంగారంలో పెట్టుబడులంటే ఇండియాలోని సంపన్నులకు ఇష్టమని నైట్‌‌ ఫ్రాంక్‌‌ రిపోర్టు  పేర్కొంది.

Latest Updates