పెరిగిన మ్యూచువల్‌ ఫండ్ అకౌంట్లు

2020లో అదనంగా 72 లక్షలు

న్యూఢిల్లీ: కిందటేడాది అదనంగా 72 లక్షల మ్యూచువల్‌ ఫండ్‌ అకౌంట్లు ఓపెన్‌‌ అయ్యాయని అమ్ఫీ పేర్కొంది. 2019లో అదనంగా 68 లక్షల అకౌంట్లు క్రియేట్‌ అయ్యాయి. కరోనా రెస్ట్రిక్షన్లతో ప్రజలు బయట ఖర్చు చేయడం తగ్గిపోయిందని, బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌‌ వైపుకి ఆకర్షితులయ్యారని ఈ సంస్థ ఓస్టేట్‌ మెంట్‌ లో పేర్కొంది. మొత్తం 45 ఫండ్‌ హౌస్‌ లకు చెందిన మ్యూచువల్‌ ఫండ్ అకౌంట్లు కిందటేడాది డిసెంబర్‌ నాటికి 9.43 కోట్లకు పెరిగాయని అసోసియేషన్ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌‌(అమ్ఫీ) పేర్కొంది. 2019 డిసెంబర్ నాటికి ఈ అకౌంట్లు 8.71 కోట్లుగా ఉన్నాయి. కరోనా దెబ్బతో మార్కెట్లు పడుతున్నప్పుడు, తిరిగి రికవరీ అయినప్పుడూ ఇన్వెస్టర్లు ఫండ్స్‌‌లలో డబ్బులు పెట్టారని మైవెల్త్‌‌గ్రో.కామ్‌ ఫౌండర్‌

హర్షద్‌ చేతన్‌‌వాలా అన్నారు. మార్ కెట్లు ఆకర్షణీయంగా ఉండడంతో మొదటిసారిగా ఇన్వెస్ట్ చేసిన వారు పెరిగారని అన్నారు. అదే విధంగా ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు కూడా కొత్త స్కీ మ్‌ లలో డబ్బులు పెట్టారని చె ప్పారు. మ్యూచువల్‌ ఫండ్‌ అకౌంట్‌ ను ఓపెన్ చేయడం ఈజీగా మారిందని గ్రో సీఓఓ హర్షజైన్ అన్నారు. డైరక్ట్‌‌ మ్యూచువల్‌ ఫండ్స్‌‌ పాపులర్‌ అవ్వడం, ఆధార్ బేస్డ్‌ వెరిఫికేషన్స్‌‌, యూపీఐ బేస్డ్ పేమెంట్స్‌‌, వివిధ ఫండ్‌ లను వేరు వేరుగా ఉంచడం, వంటివి కొత్త అకౌంట్లు పెరగడానికి కారణమయ్యాయని పేర్కొ న్నారు.

Latest Updates